Bihar: సీఎం నితీశ్ కుమార్‭తో కేసీఆర్ సమావేశం.. బీజేపీయేతర పక్షాలు కలిసి వచ్చేనా?

కొద్ది రోజుల క్రితమే బీజేపీకి బైబై చెప్పి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీతో కలిసి నితీశ్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత తేజశ్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికైతే ఇరు నేతలు బీజేపీకి తీవ్ర వ్యతిరేకులుగా ఉన్నారు. అలా వీరు యూపీఏ కూటమిలో చేరతారని చెప్పలేము. 2020 ఎన్నికల అనంతరమే కాంగ్రెస్ పార్టీపై తేజశ్వీ అసంతృప్తితో ఉన్నారు.

CM KCR meets CM Nitish at patna

Bihar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కలుసుకున్నారు. స్వయంగా బిహార్ వెళ్లిన కేసీఆర్.. రాజధాని పాట్నాలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి నితీశ్‭తో సమావేశం అయ్యారు. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే బలమైన సంకల్పంతో చాలా రోజులుగా బీజేపీయేతర, కాంగ్రెసేతర మూడో కూటమి కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నితీశ్‭ను కలిశారని తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితమే తేజశ్వీ యాదవ్ తెలంగాణకు వచ్చి కేసీఆర్‭ను కలుసుకున్నారు. అనంతరం తాజాగా కేసీఆరే స్వయంగా బిహార్ వెళ్లి నితీశ్, తేజశ్వీలను కలుసుకున్నారు. తాజా సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారని సమాచారం. అయితే కేసీఆర్ మనసులో బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి ఆలోచన ఉండగా.. కొత్తగా ఏర్పడ్డ బిహార్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యమై ఉంది. అంతే కాకుండా ఆ రాష్ట్రంలోని ఆర్జేడీతో కాంగ్రెస్ ఎన్నికల పొత్తులో కూడా ఉంది. మరి కాంగ్రెసేతర కూటమి ఆలోచనకు బిహార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోననే ఆసక్తి నెలకొంది.

కొద్ది రోజుల క్రితమే బీజేపీకి బైబై చెప్పి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీతో చేతులు కలిసిన నితీశ్.. ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ప్రతిపక్ష నేత తేజశ్వీ యాదవ్, నూతన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికైతే ఇరు నేతలు బీజేపీకి తీవ్ర వ్యతిరేకులుగా ఉన్నారు. అలా అని వీరు యూపీఏ కూటమిలో చేరతారని చెప్పలేము. 2020 ఎన్నికల అనంతరమే కాంగ్రెస్ పార్టీపై తేజశ్వీ అసంతృప్తితో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వీరిలో లేదు. ఇక నితీశ్ కాంగ్రెస్ పార్టీతో కలుస్తారనేది కొంత కష్టమే చెప్పొచ్చు. తాజాగా నితీశ్‭ను విపక్షాల ప్రధాని అభ్యర్థిగా తేజశ్వీ ప్రకటించడం ఇందుకు బలమైన ఉదాహరణ. ఈ లెక్కన చూస్తుంటే కేసీఆర్ ఆలోచనలు బిహార్ నేతల ఆలోచనలు కాస్త కలిసేట్టుగానే ఉన్నాయి.

Pakistan Floods: వాళ్లు మారరు..! వరదల్లో పాక్.. సాయమందించేందుకు సిద్ధమైన భారత్ .. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని..