Pakistan Floods: వాళ్లు మారరు..! వరదల్లో పాక్.. సాయమందించేందుకు సిద్ధమైన భారత్ .. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని..

పొరుగుదేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే.. శత్రుదేశమైనా సాయమందించేందుకు భారత్ సన్నద్ధమైంది. దేశంలో ప్రజలు వరదల్లో చిక్కుకొని చస్తున్నా పాక్ ప్రధానికి మాత్రం పట్టనట్లుగా భారత్ పై మరోసారి విషాన్నికక్కాడు. సాయమందిస్తామని భారత్ అంటే.. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Pakistan Floods: వాళ్లు మారరు..! వరదల్లో పాక్.. సాయమందించేందుకు సిద్ధమైన భారత్ .. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని..

PM narendar modi

Pakistan Floods: భారీ వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలమవుతుంది. ఏకదాటిగాకురుస్తున్న వర్షాలతో పాకిస్థాన్ లోని సగానికిపైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. వరదల దాటికి 1,100 మందికిపైగా మరణించగా, 16వందల మందికిపైగా గాయపడ్డారు. పాక్‌లో జలప్రళయంతో దాదాపు 33 మిలియన్ల మంది నిరాశ్రాయులైయ్యారు. లక్షలాది హెక్టార్లలో పంటలు నీట మునగగా, వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. పాక్‌లో చాలా ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాకిస్థాన్ అంతర్జాతీయ సాయంకోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితితో కలిసి విరాళాల కోసం అభ్యర్థించింది. దీనికి స్పందించిన అమెరికా 30మిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది.

Pakistan floods : వరదలతో అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్ .. సహాయం అందించేే యోచనలో భారత్

పొరుగుదేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే.. శత్రుదేశమైనా సాయమందించేందుకు భారత్ సన్నద్ధమైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ పాక్ లో వరదల బీభత్సాన్ని చూసి చలించిపోయారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ ఖాతానుంచి ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌లో త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేస్తూ, వరదల్లో చిక్కొకుని మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేశారు. ఆకస్మిక వరదల్లో అతలాకుతలమవుతున్న పాకిస్థాన్ కు సహాయపడటానికి భారతదేశం నుండి కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి భారత్ సిద్ధమైంది. ఎప్పుడూ వితండవాదంతో భారత్ పై అసత్యాలు ప్రచారం చేసే పాక్.. మరోసారి అదే తీరును ప్రదర్శించింది. వరదల్లో ఆ దేశ ప్రజలు చస్తుంటే.. పాక్ ప్రధానికి మాత్రం అవేవీ పట్టకపోగా.. సాయం అందిస్తామన్న భారత్‌పై మరోసారి విషంకక్కారు. కశ్మీర్ లో ముస్లింలపై మారణహోమం జరుగుతుందంటూ అసత్య ఆరోపణలు చేశాడు.

Floods in Pakistan: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. 982 మంది మృతి.. 6.8లక్షల ఇళ్లు ధ్వంసం..

భారత్‌లో ముస్లింలకు హక్కులు లేవంటూ వితండవాదం చేశాడు. విపత్కర కాలంలో పట్టింపులకు పోకుండా దేశ ప్రజలను కాపాడుకొనే ప్రక్రియపై ఏ దేశ ప్రధాని అయినా దృష్టిసారిస్తారు. కానీ పాక్ ప్రధాని మాత్రం సాయమందిస్తామని ముందుకొచ్చిన భారత్ పై సత్యదూరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్‌లో‌వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆదేశ ప్రజల నుంచి లబ్ధిపొందేందుకు భారత్‌పై కాశ్మీర్ ప్రచారాన్ని ఉపయోగించారు. ఒకపక్క వరదలతో దేశంలో జనం చస్తుంటే.. పాక్ ప్రధాని మాత్రం వితండ వాదం చేయడం పాక్ వక్ర బుద్ధిని మరోసారి తెలియజెప్పింది.