Floods in Pakistan: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. 982 మంది మృతి.. 6.8లక్షల ఇళ్లు ధ్వంసం..

పాకిస్థాన్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఆ దేశంలోని సగంమేర ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతుండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

Floods in Pakistan: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. 982 మంది మృతి.. 6.8లక్షల ఇళ్లు ధ్వంసం..

Flood in palistan

Floods in Pakistan: పాకిస్థాన్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఆ దేశంలోని సగంమేర ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతుండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వరదల బీభత్సంతో  1,456 మంది గాయపడగా, 982 మంది మరణించారు. 6.8లక్షల ఇళ్లు ధ్వంసమయినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ( ఎన్‌డిఎంఎ ) తెలిపింది. ఇదిలాఉంటే మరోవారం రోజులుపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.

Munawar Faruqui’s Delhi Show: ఢిల్లీలో రేపు జరగాల్సిన మునావర్ స్టాండప్ కామెడీ షోకు అనుమతి నిరాకరణ

వరదల కారణంగా పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో సహాయంకోసం పాక్ సైన్యాన్ని కోరింది. వరదల కారణంగా 3,000 కి.మీ రోడ్లు, దాదాపు 150 వంతెనలు, సుమారు 7 లక్షల ఇళ్లు ధ్వంసమైనట్లు పాకిస్థాన్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పాకిస్తాన్ వార్తా వెబ్‌సైట్ డాన్ శనివారం ఉదయం వరదల్లో చిక్కుకున్న ప్రాంతాలతో ఓ చిత్రాన్నిపోస్టు చేసింది. ప్రస్తుతం దేశంలో సగానికి పైగా ప్రాంతాలు నీటిలో ఉన్నాయని పేర్కొంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 5.7 మిలియన్లకుపైగా మంది నివాసాలనుంచి పునరావాస కేంద్రాలు వెళ్లిపోయారు. వరదల బీభత్సానికి పంటలు దెబ్బతినడంతోపాటు, పశువుల భారీగా మృత్యువాత పడ్డాయి

వరదల బీభత్సంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. UN సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ ఇప్పటికే 3  మిలియన్ డాలర్స్ కేటాయించింది. ఆగస్టు 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు విపత్తు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ రైల్వే పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రైళ్లను నిలిపివేసింది. మరోవైపు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు విమానాలను నిలిపివేసింది.