CM KCR On Education : తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యా విధానం అమలు చేస్తాం-కేసీఆర్

విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బావుందన్నారు. ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరం అన్నారు.

CM KCR On Education : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మోతీబాగ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను కేసీఆర్ పరిశీలించారు. అక్కడి విద్యా విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోంది. విద్యా వ్యవస్థ, పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు చేశారు కేజ్రీవాల్.

CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ

కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానంపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బావుందన్నారు. ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కూడా ఈ తరహా విద్యా విధానం అమలు చేస్తామన్నారు. తెలంగాణ నుంచి త్వరలో అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపి సమన్వయం చేసుకుంటామన్నారు కేసీఆర్.

CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ స్కూల్ చూడటానికి వచ్చారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేసీఆర్ రావడం మాకు గౌరవంగా ఉందన్నారు. స్కూల్ మొత్తం చూపించాము అని తెలిపారు. కేసీఆర్ ఎన్నో ప్రశ్నలు అడిగారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యాశాఖపై చాలా ఆసక్తి ఉందని కేజ్రీవాల్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు