Mamata Banerjee: బీజేపీ నేత గెలుపును హైకోర్టులో సవాల్ చేసిన సీఎం

అయితే ఈ విజయంపై మమత బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్న. ఓ దశలో మమత కంటే 11 వేల ఓట్ల ముందంజలో కొనసాగారు. కాగా దీనిపై దీదీ అనేక అనుమానాలు లేవనెత్తారు.

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమత బెనర్జీ ఓటమి చవిచూసిన విషయం విదితమే.. ఎన్నికలకు రెండు నెలల ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువెందు అధికారి సీఎం మమతతో పోటీపడ్డారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి వీరిద్దరూ బరిలో దిగగా మమతపై సువెందు అధికారి విజయం సాధించారు.

అయితే ఈ విజయంపై మమత బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్న. ఓ దశలో మమత కంటే 11 వేల ఓట్ల ముందంజలో కొనసాగారు. కాగా దీనిపై దీదీ అనేక అనుమానాలు లేవనెత్తారు.

కౌంటింగ్ సమయంలో సుమారు నాలుగు గంటలు సర్వర్ డౌన్ అయిందని, ఇదే సమయంలో లెక్కింపు తారుమారైందని అనుమానం వ్యక్తం చేశారు. తాను గెలిచానని చెప్పి మొదట అన్నారు.. ఈ విషయం తెలియడంతో గవర్నర్ శుభాకాంక్షలు కూడా తెలియచేశారు.

అయితే ఒక్కసారిగా ఫలితాలు తారుమారయ్యాయని రీకౌంటింగ్‌ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదని మమత తెలిపారు. ఈ మేరకే తాను కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు మమత.. ఇక ఈ ఫలితాలపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

ట్రెండింగ్ వార్తలు