పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర సీఎం వి.నారాయణస్వామి కేబినెట్ మంత్రులతో కలిసి బుధవారం(ఫిబ్రవరి-13,2019) రాజ్ నివాస్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం లెజిస్లేటివ్ అసెంబ్లీ కేబినెట్ రూమ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం మీటింగ్ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ నివాస్ కు నడుచుకుంటూ వెళ్లి ధర్నాకు దిగారు. సీపీఐ,సీపీఎమ్ నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొని మధ్యాహ్నాం ధర్నాలో కూర్చొని అందరూ కలిసి భోజనం చేశారు.
కేంద్రపాలిత ప్రాంతంలో ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉందన్న సంగతి మర్చిపోయి పుదుచ్చేరిలో పరిపాలన అప్రజాస్వామికంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేత రన్ చేయబడుతోందని సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను, ప్రపోజల్స్ ను కిరణ్ బేడీ ఆమోదించడం లేదని అన్నారు. ఏకపక్షంగా ఆమె ఆర్డర్ లను జారీ చేస్తుందని ఆరోపించారు. వెంటనే కేంద్రప్రభుత్వం గవర్నర్ కిరణ్ బేడీని రీకాల్ చేయాలని అన్నారు.
Puducherry: CM V Narayanaswamy continues to protest in front of Raj Nivas against Governor Kiran Bedi. He wants the Central govt to recall Governor Kiran Bedi & the helmet enforcement rule by DGP be taken up in a phased manner in the state. pic.twitter.com/KyxGy7wgkp
— ANI (@ANI) February 13, 2019