బాల్య వివాహాన్ని ఆపిన 13 ఏళ్ళ చిన్నారి : అవార్డుతో సత్కరించనున్న సీఎం యోగి

  • Publish Date - March 5, 2020 / 12:01 AM IST

బాల్య వివాహాం చేయటం తప్పని చెప్పి …ఒక బాలిక జీవితానికి బంగారు బాటలు వేసిన 13 ఏళ్ల  మరో బాలిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోబోతోంది.

ఉత్తర ప్రదేశ్ లోని ఖర్ఖౌదా ప్రాంతానికి చెందిన వన్షిక గౌతమ్ అనే 13 ఏళ్ళ బాలిక కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఏడాది క్రితం ఆమెకు సోదరి వరసయ్యే 16 ఏళ్ల బాలికకు వాళ్ళ తల్లి తండ్రులు  పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న వన్షిక  బాల్య వివాహాన్ని ఆపేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలెట్టింది.  (బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై దాడి)

ఆపెళ్లిని ఆపమని.. బాల్య వివాహం చేయొద్దని తన తల్లితండ్రులు బాబాయికి చెప్పింది. బాలిక మాటలను  ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోలేదు. అయినా పట్టు విడువలేదు. ఇంక డైరెక్టుగా పెళ్లి కూతురు తల్లి తండ్రుల దగ్గరకు వెళ్లింది. బాల్య వివాహం నేరమని, ఆమెకు చాలా భవిష్యత్తు ఉందని, పై చదువులు చదివించమని…కావాలంటే మరో రెండేళ్లు ఆగి, 18వ ఏట వివాహం చేయమని సూచించింది. ఈ విషయాలను ఆమె వారివద్ద పదే పదే ప్రస్తావించటంతో ఆలోచనలో పడిన బాలిక తల్లి తండ్రులు మనసు మార్చుకుని వివాహాన్ని రద్దు చేసుకున్నారు. తమ బిడ్డను పై చదువులు చదివిస్తామని మాటిచ్చారు. 

కాగా….వన్షిక కు ఇలాంటి విషయాలేమీ కొత్త కాదని…ఆమె సామాజికి సమస్యలపై అవగాహానా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోంటుందని పాఠశాల హెడ్మాస్టర్ చెప్పారు.  తమతోటి విద్యార్ధులలో ఎవరికి ఏ సమస్య వచ్చినా  ధైర్యంగా దాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువస్తుందని చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు (మార్చి5) వన్షిక ..సీఎం యోగీ ఆదిత్యనాధ్ చేతుల మీదుగా అవార్డు అందుకోబోతోంది.  ఇది మా పాఠశాలకు గర్వకారణమని ఆమె చదువుకునే పాఠశాల ఉపాధ్యాయులు ప్రశంసించారు.