Ayyappa
Ayyappa Idol Opening Eyes : వేపచెట్టు నుంచి పాలు కారడం, గణపతి విగ్రహం పాలు తాగడం, దేవుళ్ల విగ్రహాలు కళ్లు తెరవడం లాంటి వార్తలు గతంలో మనం చాలానే విన్నాం. అయితే తాజాగా దేవుడి విగ్రహం కళ్లు తెరిచిన వింత ఘటన తమిళనాడులోని జరిగింది.
గత శనివారం కోయంబత్తూరులోని మణికంఠస్వామి ఆలయంలో 40వ వార్షిక పూజలో పాల్గొనేందుకు 3వేల మందికిపైగా అయ్యప్ప భక్తులు గుడికి చేరుకున్నారు. ఈ సమయంలో పూజారులు అయ్యప్ప విగ్రహానికి అభిషేకం చేస్తుండగా.. విగ్రహం కళ్లు తెరిచినట్లు ఆలయ పూజారులు, భక్తులు గుర్తించారు. ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగుసార్లు విగ్రహం కళ్లు మూస్తూ తెరుస్తూ ఉందని భక్తులు తెలిపారు. ఈ ఘటన వీడియో వైరల్ అవడంతో ఆ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి పోటెత్తారు.
ALSO READ Pak Buys Fighter Jets : భారత్ రాఫెల్ చూసి బెంబేలెత్తిన పాక్..చైనా నుంచి యుద్ధవిమానాల కొనుగోలు