Pak Buys Fighter Jets : భారత్ రాఫెల్ చూసి బెంబేలెత్తిన పాక్..చైనా నుంచి యుద్ధవిమానాల కొనుగోలు

ఫ్రాన్స్ నుంచి భారత్ అత్యాధునిక యుద్ధ విమానాలు"రాఫెల్ ఫైటర్ జెట్స్"ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం మొత్తం 36 రాఫెల్ జెట్స్ కు భారత్ ఆర్డర్ ఇవ్వగా..ఇప్పటి వరకు 26

Pak Buys Fighter Jets : భారత్ రాఫెల్ చూసి బెంబేలెత్తిన పాక్..చైనా నుంచి యుద్ధవిమానాల కొనుగోలు

J10c

Pak Buys Fighter Jets : ఫ్రాన్స్ నుంచి భారత్ అత్యాధునిక యుద్ధ విమానాలు”రాఫెల్ ఫైటర్ జెట్స్”ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం మొత్తం 36 రాఫెల్ జెట్స్ కు భారత్ ఆర్డర్ ఇవ్వగా..ఇప్పటి వరకు 26 జెట్స్ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాలను భారత్.. చైనా,పాక్ సరిహద్దుల్లో మొహరించిన విషయం తెలిసిందే. అయితే భారత్ రాఫెల్స్ జెట్స్ ను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడంతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్..చైనా నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.

పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం తన స్వస్థలం రావల్పిండిలో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని కాలాలకు అనుగుణంగా వ్యవహరించే 25 మల్టీరోల్ J-10C యుద్ధవిమానాలను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. భారత్ రాఫెల్స్ జెట్స్ కొనుగోలుకి ప్రతిస్పందనగానే చైనా నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

25 J-10C యుద్ధవిమానాలు వచ్చే ఏడాది మార్చి 23న పాకిస్తాన్ డే కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. మార్చి-23,2022 కార్యక్రమానికి మొదటిసారిగా వీఐపీ అతిథులు పాకిస్తాన్ కు విచ్చేస్తున్నారని, ఆ రోజున J-10C విమానాలు విన్యాసాల్లో పాల్గొంటాయని,రాఫెల్ కి ప్రతిస్పందనగా చైనా నుంచి కొనుగోలు చేసిన J-10C యుద్ధవిమానాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు నిర్వహిస్తుందని మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు.

కాగా,గతేడాది డిసెంబర్-7 నుంచి 20 రోజుల పాటు పాకిస్తాన్ లో పాక్-చైనా దేశాలు సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాల్లో J-10C భాగమైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే పాకిస్తాన్ నిపుణులకు ఈ యుద్ధవిమానాలను దగ్గరగా చూసే అవకాశం దక్కింది.

మరోవైపు, పాకిస్తాన్ దగ్గర ఇప్పటికే అమెరికాలో తయారైన F-16s విమానాలుండగా,ఇవి రాఫెల్ కి మంచి సమమైనదిగా పరిగణించబడుతుంది.

ALSO READ DTC Buses Vandalised : కోవిడ్ నిబంధనలపై ఆగ్రహం..బస్సులు ధ్వంసం