DTC Buses Vandalised : కోవిడ్ నిబంధనలపై ఆగ్రహం..బస్సులు ధ్వంసం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలో బస్సు ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించగా.. కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

DTC Buses Vandalised : కోవిడ్ నిబంధనలపై ఆగ్రహం..బస్సులు ధ్వంసం

Dtc Buses

DTC Buses Vandalised : కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలో బస్సు ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించగా.. కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డును దిగ్బంధించి.. బస్సులను ధ్వంసం చేశారు.

గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మళ్లీ కోవిడ్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ కి తోడు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఈ వైరస్ వ్యాప్తిని ప్రారంభంలోనే అరికట్టేందుకు కేజ్రీవాల్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించగా..బుధవారం ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్​’ కూడా జారీ చేశారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో బస్సుల్లో 50శాతం మందినే అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అయితే బస్సుల్లో 50శాతం మందినే అనుమతించడంపై కొంతమంది ఢిల్లీవాసులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనల కారణంగా బస్సులో సీట్లు దొరక్కపోవడం ప్రయాణాలు ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. ఢిల్లీ ఎంబీ రోడ్డును దిగ్బంధించి ఢిల్లీ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​కు(డీటీసీ) చెందిన బస్సులను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. డీటీసీకి చెందిన బస్సుల అద్దాలను పగలగొట్టారు. బస్సుల ధ్వంసం అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ముందుజాగ్రత్త చర్యగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్‌.. ఆ వార్త ఫేక్..!