ఢిల్లీలో చలి..అత్యల్ప ఉష్ణోగ్రతలు

  • Publish Date - November 21, 2020 / 03:24 AM IST

Cold in Delhi..Lowest temperature : దేశ రాజధానిని కరోనాతో పాటు చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఈ సీజన్ లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని, కనీస ఉష్ణోగ్రత 7.3కు చేరుకుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. 2006, నవంబర్ 29 లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, మరలా ఇంత కనిష్ట టెంపరేచర్స్ నమోదు కాలేదని కుల్ దీప్ శ్రీవాస్తవ (IMD’s regional forecasting centre) తెలిపారు.



మైదనాలు, కొండ ప్రాంతాల్లో అధికంగా మంచు కురుస్తున్న కారణంగా..ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2019లో 11.5 డిగ్రీలు, 2018లో 10.5 డిగ్రీలు, 2017, నవంబర్ నెలలో 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదైందన్నారు. 1938, నవంబర్ 28వ తేదీన 3.9 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదైంది.



మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం 6వేల 608 కేసులు నమోదయ్యాయి. 118 మరణాలు సంభవించాయి. 4 వేల 560 కంటోన్మెంట్ జోన్ లుగా ప్రకటించారు. నవంబర్‌ ప్రారంభం నుంచి 16 రోజుల్లో లక్ష కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రద్దీగా ఉండే పెద్ద మార్కెట్‌లలో లాక్‌డౌన్‌ విధించేందుకు కేంద్రాన్ని పర్మిషన్‌ కోరింది. ఢిల్లీలో పెళ్లిళ్లకు హాజరయ్యే గెస్ట్‌ల సంఖ్యను 200 నుంచి 50 మందికి తగ్గించింది. అలాగే మాస్క్‌ ధరించని వారికి భారీగా రూ.2000 జరిమానా విధించనుంది. నదీ తీరంలో బహిరంగంగా ఛత్‌ పూజలపై నిషేధం విధించింది.

ట్రెండింగ్ వార్తలు