Kanpur Cold Wave : ఉత్తరప్రదేశ్‍లో కలకలం.. ఒక్కరోజే 25మంది మృతి..హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణాలు

ఉత్తరప్రదేశ్ లో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ తో ఒక్కరోజే 25మంది చనిపోవడం కలకలం రేపింది. అనూహ్యంగా బ్లడ్ ప్రెజర్ పెరిగి, రక్తం గడ్డ కట్టి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కి గురై మరణించినట్లు చెబుతున్నారు. కాన్పూర్ కి చెందిన 25మంది ఒక్కరోజే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయారు.

Kanpur Cold Wave : ఉత్తరప్రదేశ్ లో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ తో ఒక్కరోజే 25మంది చనిపోవడం కలకలం రేపింది. అనూహ్యంగా బ్లడ్ ప్రెజర్ పెరిగి, రక్తం గడ్డ కట్టి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కి గురై మరణించినట్లు చెబుతున్నారు. కాన్పూర్ కి చెందిన 25మంది ఒక్కరోజే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయారు.

Also Read..Heart Attack : చలికాలంలో గుండె పోటు మరణాలు అధికమా! ఎందుకిలా ?

వారిలో 15మంది ఆసుపత్రికి రాకముందే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కోల్డ్ వేవ్ కారణంగానే ఈ మరణాలన్నీ సంభవించినట్లు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ డాక్టర్లు చెబుతున్నారు. చలి తీవ్రత, చలి గాలుల ధాటికి ఒక్కసారిగా రక్తపోటు పెరగడం, రక్త గడ్డ కట్టడంతో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కి గురయ్యారని చెబుతున్నారు డాక్టర్లు.

Also Read..Heart Attack : అవతార్ 2 సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణం ; ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే?

అటు.. హిమాలయాల నుంచి వీస్తున్న చలిగాలులతో ఉత్తర భారతం వణికిపోతోంది. కాన్పూర్ లో చలి చంపేస్తోంది. అక్కడ ఇంకా 179 మంది కోల్డ్ వేవ్ బాధితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు