Yoga On Moving Train : కదులుతున్న రైలుపై యోగా చేసిన విద్యార్ధులు .. అరెస్ట్ చేసిన పోలీసులు

యోగా దినోత్సవం పేరుతో ఇటువంటి పిచ్చి పనులు ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు హెచ్చరించారు.

students Yoga On moving train

College students Arrested Yoga on moving train : అంతర్జాతీయ యోగా దినోతవ్సం రోజున ఇద్దరు యువకులు కదులుతున్న రైలుపై యోగా చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఇద్దరు యువకులు తమ బాడీని ప్రదర్శిస్తు కసరత్తులు చేశారు.యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సం రోజున కదులుతున్న గూడ్స్ రైలు ఎక్కి బోగీలపై నిలబడీ ..రెండు బోగీలై కాళ్లు వేసి పోజులిచ్చారు. వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదికాస్తా పోలీసుల దృష్టికి వచ్చింది. అంతే వారిద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున గ్రేటర్ నోయిడాలో ‘యోగా డే రీల్‌’ చేసేందుకు.. ఇద్దరు యువకులు కదులుతున్న గూడ్సు రైలు ఎక్కేశారు. బోగీలపైకి ఎక్కారు. నోయిడా సమీపంలోని ఓ వంతెనను గూడ్సు రైలు నెమ్మదిగా దాటుతుండగా.. రెండు బోగీల మధ్యలో నిల్చొని కండలు చూపుతున్నట్లుగా పోజులిచ్చారు. బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లుగా షో చేశారు. దాన్ని వీడియో తీశారు. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే పోలీసులు రంగంలోకి దిగారు.

ఇద్దరు గ్రేటర్‌ నోయిడాలోని జర్చాకు చెందిన వారుగా గుర్తించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. వారిద్దరూ కాలేజీ విద్యార్థులని తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావటానికి ఇలా చేశామని తెలిపారు. దీంతో వారిని పోలీసులు తీవ్రంగా మందలించారు.యోగా దినోత్సవం పేరుతో ఇటువంటి పిచ్చి పనులు ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు హెచ్చరించారు.