Mumbai : రిటైరైన రైలు డ్రైవర్‌కి ప్యాసింజర్స్ ఎలా వీడ్కోలు చెప్పారంటే?

రైలు డ్రైవర్‌గా పదవీ విరమణ చేసిన డ్రైవర్‌కి ముంబయి ప్రయాణికులు ఘనంగా వీడ్కోలు పలికారు. డ్యాన్సులు చేసి సందడి చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Mumbai

Mumbai : నిత్యం ఎంతోమంది ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్ధానాలకు చేర్చడంలో రైలు డ్రైవర్ల బాధ్యత ముడిపడి ఉంటుంది. అలాంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించి పదవీ విరమణ చేసిన ఓ ట్రైన్ డ్రైవర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు ప్రయాణికులు. డ్యాన్సులు చేస్తూ సందడి చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Thrigun : ఘనంగా టాలీవుడ్ హీరో పెళ్లి వేడుక.. నెట్టింట ఫోటోలు వైరల్..

ముంబయి లోకల్ ట్రైన్ డ్రైవర్ పదవీ విరమణను ప్రయాణికులు ఘనంగా జరిపారు. తన కెరియర్‌లో చివరి షిఫ్ట్ పూర్తి చేసిన తర్వాత ప్రయాణికులు అతని కోసం డ్యాన్స్ చేసిన వీడియో క్లిప్ అందరి మనసు దోచుకుంది. ముంబయి రైల్వే యూజర్స్ (@mumbairailusers) ఖాతా నుంచి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘గత వారం ఒక మోటర్ మ్యాన్ తన పదవీ విరమణ రోజున చివరి సారిగా లోకల్ ట్రైన్ నడిపినపుడు జరిగిన వేడుక. ఎన్నో ఏళ్లపాటు సేవలందించిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా పదవీ విరమణ చేయడం చాలా పెద్ద అచీవ్ మెంట్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసారు.

Amala : నాగార్జున పాటకు స్టేజిపై డాన్స్ వేసి అదరగొట్టిన అమల.. వీడియో వైరల్..

ఆ ట్రైన్ డ్రైవర్‌కి నెటిజన్లు అభినందనలు తెలిపారు. ఎంత ప్రశంసనీయమైన విజయం.. అంటూ కామెంట్లు పెట్టారు.