Thrigun : ఘనంగా టాలీవుడ్ హీరో పెళ్లి వేడుక.. నెట్టింట ఫోటోలు వైరల్..
టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్ పెళ్లి పీటలు ఎక్కేశాడు. ఆదివారం తమిళనాడులో..

Tollywood actor Thrigun aliyas Adith Arun marriage
Thrigun : టాలీవుడ్ లో ఉన్న బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే తెలుగు యంగ్ హీరో త్రిగన్.. తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై పలికేశాడు. ఇటీవలే తన పెళ్లి కబురుని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసిన త్రిగన్.. సెప్టెంబర్ 3న నివేదితా (Nivedita) అనే అమ్మాయి మేడలో మూడుముళ్లు వేశాడు. తమిళనాడు తిరుప్పూర్ లోని అవినాషి సిటీలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్ళికి ఇరు కుటుంబసభ్యులతో పాటు ఫిలిం వర్గం నుంచి కూడా పలువురు హాజరయ్యారు.
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు పై పవన్ కళ్యాణ్‌కి ఇంటరెస్ట్ లేదు.. ఏ ఎం రత్నం జవాబు..
ఈక్రమంలోనే హైదరాబాద్ నుంచి తేజస్వి మదివాడ, ఆదర్శ్ బాలకృష్ణ.. తదితరులు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసి త్రిగుణ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన తెలుగు ఆడియన్స్ త్రిగుణ్‌కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ఫస్ట్ డే ప్రోమో వచ్చేసింది.. అప్పుడే లవ్ ట్రాక్ షురూ.. ఎవరో తెలుసా..?
View this post on Instagram
కాగా త్రిగుణ్ అసలు పేరు.. అదిత్ ఈశ్వరన్. తెలుగు సినిమా ‘కథ’తో ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఆ తరువాత తమిళంలో ‘హ్యాపీ డేస్’ రీమేక్ లో నటించాడు. అప్పటి నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ నటిస్తూ వస్తున్నాడు. రీసెంట్ ‘ప్రేమదేశం’, ఆర్జీవీ ‘కొండా’ సినిమాలతో ఆడియన్స్ ని పలకరించాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ వస్తున్నాడు. హీరోగా, సపోర్టింగ్ యాక్టర్ గా.. ఇటు తెలుగు, అటు తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.