Black Dates: నల్ల ఖర్జూరం ఒక అద్భుతం.. రోజూ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
నల్ల ఖర్జూరం "బ్లాక్ డేట్స్" (Black Dates)అనేది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాహారం. వీటిలో పుష్కలమైన విటమిన్లు,

Health benefits of eating black dates every day
Black Dates: నల్ల ఖర్జూరం “బ్లాక్ డేట్స్” అనేది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాహారం. వీటిలో పుష్కలమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి కీలక పోషకాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, వీటిని రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. మరి నల్ల ఖర్జుర(Black Dates) రోజు తినడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను, వాటిని ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Mobile Usage: మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ చిన్న చిట్కా పాటించండి.. మొబైల్ మొహం కూడా చూడరు
1.ఎనర్జీ కోసం అద్భుతమైన సహాయకుడు:
నల్ల ఖర్జూరాలలో నేచురల్ షుగర్స్, గ్లూకోజ్, ఫ్రుక్టోజ్, సుక్రోజ్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా వర్కౌట్ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
2.రక్తహీనత నివారణ:
నల్ల ఖర్జూరంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ లెవల్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మహిళలు, గర్భిణీలు, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. జీర్ణ వ్యవస్థకు మేలు:
నల్ల ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గ్యాస్, మల బద్దకము వంటి సమస్యలు తగ్గుతాయి.
4.గుండె ఆరోగ్యానికి మంచిది:
నల్ల ఖర్జూరంలో పటాషియం, మాగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల హై బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండెపోటు రిస్క్ తగ్గుతుంది.
5.ఇమ్యూనిటీ మెరుగుపరచడం:
నల్ల ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు, వైరల్స్, వ్యాధులను తగ్గిస్తుంది.
6.ఎముకల ఆరోగ్యం:
క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండే నల్ల ఖర్జూరం ఎముకల బలానికి తోడ్పడుతుంది. ఆస్తియోపోరోసిస్ నివారణ, వృద్ధాప్యంలో ఎముకల నొప్పులను తగ్గిస్తుంది.
7.మానసిక ఆరోగ్యానికి మేలు:
నల్ల ఖర్జూరాలలో బి-కాంప్లెక్స్ విటమిన్లు, మగ్నీషియం వంటివి మెదడు ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. తద్వారా స్ట్రెస్, మూడ్ స్వింగ్‌లు, మెమొరీ మెరుగుదల అవుతుంది.
8.గర్భిణీ స్త్రీలకు మేలు:
నల్ల ఖర్జూరం గర్భధారణ సమయంలో తీసుకుంటే శక్తిని, ఐరన్ ను అందించడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రసవ సమయంలో అద్భుతంగా పని చేస్తుంది.
9.చర్మ ఆరోగ్యానికి మేలు:
నల్ల ఖర్జురలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తేజంగా ఉంచుతుంది. ఇవి ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి.
జాగ్రత్తలు:
- ఎక్కువగా తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
- మధుమేహ రోగులు తక్కువ మోతాదులో, డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి.
- ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ సమస్య కలగవచ్చు.