Mobile Usage: మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ చిన్న చిట్కా పాటించండి.. మొబైల్ మొహం కూడా చూడరు

ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్(Mobile Usage) మన జీవితంలో కాదు మన శరీరంలోనే ఒక భాగంగా మారిపోయింది.

Mobile Usage: మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ చిన్న చిట్కా పాటించండి.. మొబైల్ మొహం కూడా చూడరు

5 tips to completely reduce mobile usage

Updated On : August 22, 2025 / 6:38 PM IST

Mobile Usage: ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ మన జీవితంలో కాదు మన శరీరంలోనే ఒక భాగంగా మారిపోయింది. ఒక్క క్షణం మొబైల్ లేకపోతే వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందా అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. సమాచారానికి, వినోదానికి, పని నిర్వహణకు మొబైల్ ఒక ప్రధాన సాధనంగా మారింది. అయితే, అధికంగా మొబైల్ వాడకం(Mobile Usage) వల్ల ఆరోగ్యం, నిద్ర, మానవ సంబంధాలు, మనసు స్థిరత మొదలైన అంశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అందుకే, చాలా మంది దీని వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, చేయలేకపోతున్నారు. అయితే, మనం చేసుకునే చిన్న చిన్న మార్పుల వల్ల మైబైల్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.మొబైల్ వాడే సమయానికి పరిమితి విధించండి:
ప్రతి రోజు మొబైల్ ఉపయోగానికి ఒక గడువు పెట్టుకోవాలి. సోషల్ మీడియా, యూట్యూబ్, గేమ్స్ వంటివి రోజుకు 30 నిమిషాలకి పరిమితం చేయాలి.
మీరు ఆండ్రాయిడ్/ ఐ ఫోన్ వాడుతున్నవారైతే వాటిలో డిజిటల్ వెల్బీయింగ్ లేదా స్క్రీన్ టైం ఫీచర్లను ఉపయోగించి నిర్దిష్ట యాప్స్‌కు టైం లిమిట్ ను సెట్ చేసుకోవచ్చు.

2.నోటిఫికేషన్లు తగ్గించండి:
మొబైల్ నుండి నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది అంటే వెంటనే తెరిచి చూస్తాం. కాబట్టి, ఇది మళ్లీ మళ్లీ ఫోన్ తీసుకునే అలవాటుకు దారి తీస్తుంది. కావున అవసరం లేని యాప్స్ (సోషల్ మీడియా, షాపింగ్, గేమ్స్) నోటిఫికేషన్లు ఆఫ్ చేసుకోండి.

3. నో ఫోన్ జోన్లు పెట్టుకోండి:
కొన్ని సమయాల్లో ఫోన్ కు పూర్తిగా దూరంగా ఉండండి. భోజన సమయం, కుటుంబంతో గడిపే సమయం, నిద్రపోయే గంట ముందు. ఇలా చేయడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి, నిద్రా నాణ్యత పెరుగుతుంది.

4.ప్రత్యామ్నాయ పనులను చేయండి:
ఫోన్ తీసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని భర్తీ చేసే పనిని అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం, వాకింగ్, గార్డెనింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ వినడం, శారీరక వ్యాయామం. ఇవి మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాక, డిజిటల్ డిటాక్స్‌లో సహాయపడతాయి.

5.నిద్రకు ముందు మొబైల్ దూరం పెట్టండి:
రాత్రి నిద్రకు ముందు కనీసం గంట ముందు మొబైల్ వాడకం మానేయడం మంచిది. మొబైల్ నుండి వచ్చే బ్లూ లైట్ మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనివల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, ఫోన్‌ను పడకగదిలో కాకుండా ఇతర గదిలో ఉంచడం ఉత్తమం.