Quit Alcohol: మద్యం తాగడం మానేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. మళ్ళీ అలవాటు కూడా చేసుకోలేరు
మద్యపాణం(Quit Alcohol) అనేది ప్రాణాంతకమైన అలవాటు. ఇది లివర్, గుండె, జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

5 types of processes needed to quit alcohol
Quit Alcohol: మద్యపాణం అనేది ప్రాణాంతకమైన అలవాటు. ఇది లివర్, గుండె, జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయినప్పటికీ, చాలా మంది మత్తు కోసం దీనికి బానిస అవుతున్నారు. అయితే, ఆ విషయాన్నీ గ్రహించిన కొంతమంది ఆ అలవాటు నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నప్పటికీ రాలేకపోతున్నారు. ఒక్కసారి తాగడం అనేది అలవాటుగా మారిన తర్వాత మానేయడం చాలా కష్టం. కానీ, సరైన దారిలో ప్రయత్నిస్తే అది సాధ్యమే. కాబట్టి, మద్యం తాగడం మానేయడం(Quit Alcohol)లో సహాయపడే 5 రకాల చిట్కాలు, అలాగే అవి ఎలా ప్రభావవంతంగా పని చేస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: గర్భిణీలలో కాల్షియం లోపమా.. శిశువుకు ప్రమాదం కావచ్చు.. జాగ్రత్త సుమీ
1.మద్యం తాగే కారణాన్ని గుర్తించండి:
ముందుగా ఎప్పుడు మద్యం తాగాలనిపిస్తుంది అనే పరిస్థితులను గుర్తించాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడా, ఒంటరిగా ఉన్నప్పుడా, స్నేహితుల ప్రోత్సాహంతోనా. తాగడానికి దారితీసే కారణాలను గుర్తించి వాటిని నివారించగలిగితే, ఆ అలవాటును నియంత్రించడం సులభం అవుతుంది.
2.ప్రత్యామ్నాయ అలవాట్లు:
మద్యం తాగాలనిపించినప్పుడు దాన్ని భర్తీ చేసే ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి. ఉదాహరణకు నాటు శీతలపానీయాలు (కంజి, నిమ్మరసం, బెల్లం చార్) పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కళలు అభ్యాసం చేయడం వంటివి చేయాలి.
3.మద్యం తాగే వాతావరణాన్ని దూరం చేయండి:
ఇంట్లో మద్యం ఉండకుండా చూసుకోవాలి. తాగే స్నేహితులతో ఎక్కువ సమయం గడపకుండా చూసుకోండి. పరిస్థితులు మార్చకపోతే అలవాటు మారదు. వాతావరణమే మొదటి మార్పని గుర్తించండి.
4.చిన్న లక్ష్యాలు, స్థిరమైన పురోగతి:
ఒక్కసారిగా మద్యం మానేయాలని ప్రయత్నించకండి. స్థిరమైన లక్షలను పెట్టుకోండి. నెమ్మదిగా అధిగమించండి. మొదట రోజుకు తాగే పరిమాణాన్ని తగ్గించండి. ఆ తర్వాత వారానికి 1 నుంచి 2 రోజులు గ్యాప్ ఇవ్వండి. తర్వాత పూర్తిగా మానేయండి
5.మానసిక, వైద్యల మద్దతు తీసుకోండి:
మద్యం మానేయడం ఓ వ్యక్తిగత ప్రయాణం. అయినప్పటికి ఒకరి మద్దతు తీసుకోవడం మంచిదే. సిగ్గుపడకండి. కౌన్సిలింగ్ లేదా థెరపీ ద్వారా భావోద్వేగ సహాయం దొరుకుతుంది.
మద్యం మానేసిన తర్వాత కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
- లివర్ ఆరోగ్యం
- మెదడు శక్తి ఫోకస్
- నిద్ర, మూడ్ మెరుగవుతాయి
- ఆర్థికంగా బలోపేతం
- కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి
- దేహ శక్తి