Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు పై పవన్ కళ్యాణ్‌కి ఇంటరెస్ట్ లేదు.. ఏ ఎం రత్నం జవాబు..
పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా పై ఇంటరెస్ట్ లేదు. అందుకనే ఆ మూవీ పక్కన పెట్టేశాడు అనే కామెంట్స్ పై నిర్మాత ఏ ఎం రత్నం జవాబు..

A M Rathnam comments on Pawan Kalyan Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మొట్టమొదటిసారి యోధుడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరిహరవీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. AM రత్నం ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. 2020 నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే వస్తుంది. పవన్ ఈ చిత్రం తరువాత మొదలు పెట్టిన సినిమాలను కూడా పూర్తి చేసేస్తున్నాడు.
Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ఫస్ట్ డే ప్రోమో వచ్చేసింది.. అప్పుడే లవ్ ట్రాక్ షురూ.. ఎవరో తెలుసా..?
కానీ ఇది మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో ఈ మూవీ పై అనేక రూమర్స్ వస్తున్నాయి. వాటిలో ఒకటి పవన్ ఈ సినిమా పై పెద్దగా ఇంటరెస్ట్ చూపడం లేదు, అందుకనే మూవీని పక్కన పెట్టేశాడని. తాజాగా ఒక మూవీ ప్రెస్ మీట్ లో ఈ విషయం గురించి నిర్మాత ఏ ఎం రత్నంని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “వీరమల్లు పీరియాడిక్ మూవీ. ఇతర సినిమాలకు ఇచ్చే డేట్స్ అన్ని కలిపి ఇచ్చినా ఆ సినిమా చేయలేము. ఎందుకంటే ఎన్నో సెట్స్ వెయ్యాలి, గ్రాఫిక్స్ ఇంకా చాలా పనులు ఉంటాయి. దీంతో తక్కువ రోజుల్లో అయ్యిపోయే సినిమాలను ముందుగా పూర్తి చేసేస్తున్నారు. మా సినిమాని కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపు పూర్తి చేసి ఎన్నికల్ల ముందే సినిమాని రిలీజ్ చేస్తాము” అంటూ చెప్పుకొచ్చాడు.
Pushpa 2 : పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌కి 1000 కోట్లు ఆఫర్ చేశారా..?
దీంతో మరోసారి సినిమా పై వచ్చే రూమర్లకు నిర్మాత చెక్ పెట్టినట్లు అయ్యింది. కాగా ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్న పవన్.. త్వరలోనే వీరమల్లు సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు.
#HariHaraVeeraMallu to be completed by year end & Release before Elections- AM Rathnam
UBS, HHVM and OG anni 1 year loney vachesa la unay ?pic.twitter.com/hinQySWaYU
— ★彡 ?????? ??? ?彡★ (@_jspnaveen) September 4, 2023