Amala : నాగార్జున పాటకు స్టేజిపై డాన్స్ వేసి అదరగొట్టిన అమల.. వీడియో వైరల్..

యాక్టింగ్ కి గుడ్ బై చెప్పిన తరువాత బయట ఈవెంట్ లో పెద్దగా కనిపించని అమల.. తాజాగా ఒక కార్యక్రమంలో నాగార్జున పాటకి స్టేజిపై డాన్స్ చేసి అదరహో అనిపించారు.

Amala : నాగార్జున పాటకు స్టేజిపై డాన్స్ వేసి అదరగొట్టిన అమల.. వీడియో వైరల్..

Amala dance for Nagarjuna song at annapurna film college fest

Amala : సౌత్ స్టార్ సీనియర్ హీరోయిన్ ‘అమల’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగార్జునతో (Nagarjuna) పెళ్లి తరువాత యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసినా.. అప్పుడప్పుడు ఏదొక సినిమాలో కనిపిస్తుంటారు. చివరిగా గత ఏడాది శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో అమ్మ పాత్రలో నటించి అందర్నీ మైమరపించారు. సినిమాలు లేదా ఫంక్షన్స్ లో తప్ప బయట పెద్దగా కనిపించని అమల.. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో స్టేజి పై నాగార్జున పాటకు డాన్స్ వేసి అదరహో అనిపించారు. నిన్న సెప్టెంబర్ 2న అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజ్ లో ‘NEO FIESTA 2K23’ కార్యక్రమం జరిగింది.

Vijay Deverakonda : యాదాద్రి ఆలయం గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్.. తెలంగాణ ప్రభుత్వం..

ఇక ఈ ఫెస్ట్ లో అమల కూడా పాల్గొన్నారు. ఈక్రమంలోనే స్టేజి పై నాగార్జున ‘హలో బ్రదర్‌’లోని సూపర్ హిట్ సాంగ్ ‘ప్రియ రాగాలే’కు కాలు కదిపి అదరగొట్టారు. యాక్టింగ్ కి గుడ్ బై చెప్పిన తరువాత.. అమల మళ్ళీ ఇప్పుడే ఇలా డాన్స్ వేస్తూ ఆడియన్స్ కి కనిపించడం. ఇక ఈ వీడియోని ఒక అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ లైక్స్ కొడుతూ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.

NTR : ఆ పాత్రకు న్యాయం చేయగల నటుడు ఒక ఎన్టీఆర్ మాత్రమే.. బాలీవుడ్ దర్శకుడు..!

నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తన 99వ సినిమాని ప్రకటించాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) అనే మాస్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ డైరెక్ట్ చేయబోతున్నాడు. చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.