Comprehensive Consultations With Stakeholders Must For Electoral Reforms: Rijiju
National Voters’ Day: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఎక్కువ మందిని ఓటు వేసేలా ప్రోత్సహించడం, అలాగే వారి ఓటింగ్ విధానాన్ని సులభరతం చేయాలని ప్రభుత్వాన్ని ఈ యేడాది థీమ్‌గా నిర్ణయించింది. ఈ విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ బుధవారం ట్వీట్ చేశారు.
Odisha: అవమానాన్ని తట్టుకోలేకే.. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ సీఎం.. బీఆర్ఎస్లో చేరే ఛాన్స్
‘‘జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ‘నేను తప్పని సరిగా ఓటు వేస్తాను’ అనే సంకల్పాన్ని తీసుకుని, ఎన్నికల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మనందరం కలిసి పని చేద్దాం. ఈ విషయంలో ఎన్నికల సంఘం కృషిని నేను అభినందిస్తున్నాను’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీటులో ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేశారు.
Sushma Swaraj: సుష్మా స్వరాజ్‌పై అమెరికా మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇక ఎన్నికల సంస్కరణ విషయంలో రాజకీయ పార్టీలతో సమగ్ర సంప్రదింపులు అవసరమని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బుధవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల సంస్కరణనపై వివిధ ప్రతిపాదనలను ప్రస్తావిస్తూ.. సంప్రదింపులు, చర్చలు శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి చిహ్నమని అన్నారు. ఏడాది క్రితం ఎన్నికల చట్టాల్లో చేసిన మార్పుల వల్ల ఎన్నికల జాబితాలో 1.5 కోట్ల మంది కొత్త ఓటర్లు చేరారని అన్నారు.