Sushma Swaraj: సుష్మా స్వరాజ్‌పై అమెరికా మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్‌ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆమెను అగౌరవపరిచేలా చేసిన వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.

US Ex Top Official's Big Claim On S Jaishankar Commenting On Sushma Swaraj
Sushma Swaraj: భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై అమెరికా విదేశాంగ మాజీ మంత్రి మైక్ పాంపియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె రాసిన ‘నెవర్ గివ్ ఏ ఇంచ్.. ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ అనే పుస్తకంలో సుష్మా స్వరాజ్ గురించి ప్రస్తావిస్తూ ఆమెను తానెప్పుడూ భారత రాజకీయాల్లో ప్రముఖమైన నాయకురాలిగా భావించలేదని అన్నారు. అందుకే తాను మోదీకి అత్యంత సన్నిహితుడైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో కలిసి పని చేశానని రాసుకొచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగినట్టే కనిపిస్తోంది. భారత్ నుంచి దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
WhatsApp Native Mac App : వాట్సాప్ పబ్లిక్ బీటాలో లోకల్ మ్యాక్ యాప్ వచ్చేసింది..!
ఇకపోతే, మోదీ మొదటి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన సుష్మా స్వరాజ్‌తో దౌత్యానికి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పిన ఆయన.. ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్‌తో మాత్రం సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. జయశంకర్ మాట్లాడే ఏడు భాషల్లో ఇంగ్లీష్ ఒకటని, తన కంటే కూడా ఆయన మెరుగ్గా మాట్లాడతారని కొనియాడారు. జయశంకర్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తానని చెప్పుకొచ్చారు. సుష్మాతో తాను రాజకీయంగా కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లు పాంపింయా తన పుస్తకంలో పేర్కొనడం గమనార్హం.
దీనిపై కేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్‌ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆమెను అగౌరవపరిచేలా చేసిన వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.