Coronavirus quarantine: రాకెట్లా దూసుకెళ్తున్న కండోమ్స్ అమ్మకాలు

ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా.. ధాటికి మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజులు, వెంటిలేటర్లు కొరత ఏర్పడుతున్న మాట వాస్తవమే. వీటితో పాటు కండోమ్ ల అమ్మకాలు ఊపందుకున్నాయట. మునుపెన్నడూ లేని విధంగా 25 నుంచి 50 శాతం అమ్మకాలు పెరిగాయని ఆర్డర్లు పెంచుతున్నారట షాప్ రిటైలర్లు. ‘సాధారణంగా ఒక్కో ప్యాక్‌లో 3 ఉండే దానిని కొనుగోలు చేసే వాళ్లంతా ఒకేసారి 10 నుంచి 20ప్యాకెట్లు తీసుకెళ్లిపోతున్నారు’ అంటున్నారు రిటైలర్లు. 

మాల్స్ షట్ డౌన్ అవడం మొదలైనప్పటి నుంచి కండోమ్ ల అమ్మకాలు పెరుగుతన్నాయి. వీటితో పాటు సెక్స్ టాయ్స్ కు కూడా ఆర్డర్లు వస్తున్నప్పటికీ డెలివరీ ఏజెంట్లు కరువై అమ్మకాలు వాయిదా పడుతున్నాయట. ప్రజలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏం చేస్తున్నా.. కుటుంబ నియంత్రణను మాత్రం మరిచిపోవడం లేదంటున్నారు విశ్లేకులు. 

బుధవారం పోర్న్ హబ్ సైట్ తమ వద్ద ఉన్న ప్రీమియం డేటాను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక ఇంట్లో నుంచి బయటకు రావడమెందుకు. ఓటీటీ ప్లాట్ ఫాంలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సర్వీసులు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీగానే ఉన్నాయి. ఇక కరోనా లింక్ కట్ చేయడంలో మీరూ ఓ ఆప్షన్ ఎంచుకుని ఇంటికే పరిమితమైపోండి. 

ప్రపంచ వ్యాప్తంగా 4లక్షల 23వేల 660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 18వేల 923మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో 582కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 11మంది ప్రాణాలు కోల్పోయారు. 41మంది రికవరీ కావడంతో డిశ్చార్జ్ అయ్యారు.