Congress Election Committee : కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించిన కాంగ్రెస్.. తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒక్కరికే అవకాశం

పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. Congress Central Election Committee

Congress Central Election Committee

Congress Central Election Committee : కేంద్ర ఎన్నికల కమిటీని కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో 16మందితో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అనౌన్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే ఈ కమిటీలో చోటు దక్కింది. అదీ తెలంగాణ నేతకు అవకాశం ఇచ్చారు.

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. ఈ ఎన్నికల కమిటీలో సభ్యులుగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Also Read..Gone Prakash Rao : జమిలి ఎన్నికలు సాధ్యం కాదు.. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు : గోనె ప్రకాష్ రావు

కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో సభ్యులు..
మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, ప్రితం సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యజ్ఞిక్, పిఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసి వేణుగోపాల్.

Also Read..Renuka Chowdhury : తెలంగాణ కోడలిని అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అలాంటి వాళ్లను రాజకీయ రాబందులు అంటారు- వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత నిప్పులు

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యం పెరుగుతోంది అని చెప్పొచ్చు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏర్పడిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఉత్తమ్ కు మాత్రమే అవకాశం దక్కడమే ఇందుకు నిదర్శనం. సోనియా, రాహుల్ వంటి హేమాహేమీలు ఉన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కు అవకాశం దక్కింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా ఆయనకు స్థానం దక్కడంతో ఉత్తమ్ కు మరింత ప్రాధాన్యం దక్కినట్లు అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు