Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన మహా వికాస్ అఘాడి కూటమి.. అవేమిటంటే?

ముంబయి సభలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మహారాష్ట్రలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం పతనమైన అంశాన్ని ..

Rahul Gandhi

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ) కూటమి గెలుపే లక్ష్యంగా కృషి చేస్తోంది. తాజాగా కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పాల్గొని ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో కీలకంగా ఐదు హామీలను ఇచ్చారు.

Also Read : వచ్చే బోర్డు మీటింగ్‌లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం- టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు

రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే.. మహాలక్ష్మీ యోజన కింద మహిళలకు నెలకు రూ.3వేల ఆర్ధికసాయం అందజేస్తామని కూటమి నేతలు పేర్కొన్నారు. అదేవిధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రూ. 3లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని, రుణం సకాలంలో చెల్లించిన వారికి రూ. 50వేలు ప్రోత్సాహకం ఇస్తామని చెప్పారు. కులగణన నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని తొలగిస్తామని మహా వికాస్ అఘాడి కూటమి నేతలు హామీ ఇచ్చారు. అదేవిధంగా.. కుటుంబానికి రూ. 25లక్షల ఆరోగ్య బీమా, ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.

 

ముంబయి సభలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మహారాష్ట్రలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం పతనమైన అంశాన్ని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. బీజేపీ హయాంలో మహారాష్ట్రలో లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించగలిగే పెద్ద ప్రాజెక్టులన్నీ తరలిపోతున్నాయని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. అక్కడ కుల గణన ప్రక్రియ మొదలైంది.. మహారాష్ట్రలోనూ మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇక్కడకూడా కులగణన చేపడతామని రాహుల్ చెప్పారు.