కరోనా నయం కావాలంటే..Rum తాగాలంట..కాంగ్రెస్ కౌన్సిలర్ సూచన

  • Publish Date - July 18, 2020 / 01:03 PM IST

కరోనా నయం కావాలంటే..Rum తాగాలని…ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్యులు శ్రమిస్తున్న సందర్భంలో ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన..ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏమిటంటే…
కర్నాటక రాష్ట్రంలోని ఉల్లాల్ సిటీ మున్సిపల్ కౌన్సిల్ (సీఎంసీ)కి చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రవిచంద్ర కరోనా కట్టడి కావాలంటే..ఒక 90ml Rum తీసుకోవాలంటున్నాడు. బ్రాందీ, విస్కీ, వోడ్కాలాగే..రమ్ కూడా ఒక వెరైటీ అనే సంగతి తెలిసిందే.

గ్లాస్ లో పోసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి..చేతి వేలితో కలుపుక్కోవాలని సూచించాడు. Rum తో పాటు Half Boild Egg లేదా, ఆమ్లెట్ తినాలని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో రమ్ చేతిలో పట్టుకుని చెబుతుండడం మరో విశేషం.

ఒక రాజకీయ నేతగా తాను సలహాలు ఇవ్వడం లేదంటున్నాడు. చాలా మంది రమ్ సేవిస్తున్నారని, కానీ మద్యం సేవించనని తెలిపారు.

ఈ విషయం అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతల్లో పడింది. అతనిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అంటున్నారు. గో మూత్ర తీసుకోవాలని ఓ బీజేపీ లీడర్ చెప్పాడని ఓ నెటిజన్ గుర్తు చేస్తున్నాడు. Whoకు ఈ విషయాన్ని చెప్పాలని మరో నెటిజన్ సూచిస్తున్నాడు. మొత్తానికి..కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..మరికొందరు లైట్ తీస్కోండి అంటున్నారు.