KC Venugopal : ఇవి సెమీ ఫైనల్స్ .. ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కాంగ్రెసే : కేసీ వేణుగోపాల్

తెలంగాణలో పాటు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణలో తమదే విజయం అని కాంగ్రెస్ ధీమా వ్యక్తంచేస్తోంది. టీ కాంగ్రెస్ నేతలే కాకుండా అధిష్టానం కూడా ఇదే నమ్మకంతో ఉంది.

KC Venugopal

KC Venugopal Five states Elections comments : తెలంగాణలో పాటు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా నిన్న మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌‭లో పోలింగ్ జరిగింది. ఇక మిగిలిన మూడు రాష్ట్రాల్లోను ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే ..తెలంగాణలో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లోను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెసే అంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌.

ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు.. ఈ ఎన్నికలు 2024 పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్ అనీ..ఈ ఐదు రాష్ట్రాల్లోను గెలుపు కాంగ్రెస్ దేనన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని..తాము ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తామో ప్రజలకు పూర్తి వివరించామని అన్నారు. ప్రజలకు ఏ వాగ్ధానాలు చేశామో వాటిని అమలు చేస్తామని తెలిపారు.

అలాగే చేసిన వాగ్ధానాల్లో భాగంగా కులగణను విషయాన్ని కూడా ప్రస్తావించిన ఆయన కుల గణనకు ఎన్నికల ప్రయోజనాలతో సంబంధం లేదన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీ చేపట్టాల్సిన సాధారణ అంశమని ..అందుకే మేము ఆ సమస్యను తీసుకున్నామని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన ఇండియా కూటమి గురించి ప్రస్తావిస్తు..మా కూటమి ఏక పక్ష కూటమి కాదన్నారు. 27 పార్టీలు ఉన్న ఈ కూటమిలో భిన్నాభిప్రాయాలు సర్వసాధరణమని అది పెద్ద విషయం కాదన్నారు. ఒక్కో పార్టీకి ఒక్కో విధమైన ఆలోచనలు ఉంటాయి. బలాలు, బలహీనతలు ఉంటాయి. విభేధాలు కూడా ఉంటాయి. వాటిని తాము సమన్వయం చేసుకుంటామన్నారు. ఏది ఏమైనా ఇండియా కూటమి పటిష్టంగా ఉందని తెలిపారు.