Jairam Ramesh.. IndiGo airline
Jairam Ramesh.. IndiGo airline : ప్రముఖ విమానయాన సంస్థ ఇండియో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించింది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఇండిగో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తు ఓటు వేయాలని విమానాల్లో ప్రకటించింది అని కాబట్టి ఇండిగోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత వారం తాను ఢిల్లీ నుంచి ఆయిజోల్ కు ఇండిగో విమానంలో ప్రయాణించానని ఆ సమయంలో ఇండిగో సంస్థకు చెందిన విమానాల్లో ప్రధాని మోదీని ప్రశంసించటమే కాకుండా ఓటు వేయాలని రెండు విమానాల్లో ప్రకటన వెలుడింది అంటూ ఆరోపించారు. ప్రయాణీకులకు మోదీకి ఓటు వేయాలని ప్రకటిస్తున్నారంటూ మండిపడ్డారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగుతున్న సమయంలో ఇండిగో చేసిన ఈ ప్రకటన ఎన్నికల ఉల్లంఘనకు వస్తుందని..పేర్కొన్నారు. కానీ దీనిపై ఇండిగో సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
Delhi HC : ఆ మహిళా న్యాయమూర్తికి మరణశిక్ష విధించాలంటూ హైకోర్టులో పిటీషన్ .. షాక్ మామూలుగా లేదుగా..
ఇండిగో ప్రకటనపై జైరాం రమేశ్ మాట్లాడుతు..కొన్ని కార్పొరేట్ సంస్థలు మోదీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నాయని అన్నారు.కాగా..తెలంగాణ,రాజస్థాన్, మధ్యప్రదేశ్,చత్తీస్ గఢ్,విజోరాంలలో ఎన్నికలు జరుగనున్నాయనే విషయం తెలిసిందే. వీటి ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడనున్నాయి. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది.