Rahul
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సోమవారం నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ..అక్కడి ఓ పబ్‌లో ఖుషీ ఖుషీగా గడుపుతూ..వీడియో కంట పడ్డారు. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ పబ్‌లో రాహుల్ గాంధీ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశం కష్ట కాలంలో ఉంటే ఖాట్మండులో రాహుల్ పార్టీ చేసుకుంటున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే రాహుల్..అక్కడ పబ్ కల్చర్‌కు అలవాటు పడ్డారంటూ బీజేపీ నేతలు విమర్శించారు. రాజకీయాల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుతుందని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు రాహుల్ పబ్‌లో గడపడంపై నెటిజన్లు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also read:Elon musk: ట్విటర్‌కు కొత్త సీఈఓ..? మరికొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలికే ఆలోచనలో మస్క్..
సరదాగా వెళితే తప్పేంటి అంటూ కొందరు అంటే..రాహుల్‌కి ఇంకా కుర్రతనం పోలేదంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. కాగా ఓ వివాహ వేడుక కోసం రాహుల్ గాంధీ ఖాట్మండుకి చేరుకున్నారు. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్, రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశం సంక్షోభంలో ఉంటే ప్రధాని మోదీ విదేశాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ మోదీపై చేసిన విమర్శలకు కౌంటర్‌గా ఖాట్మండులో రాహుల్ గాంధీ పబ్ వీడియోను బీజేపీ నేతలు బయటకు తెచ్చారు.
Noiiice ? pic.twitter.com/jTvUyVuE7A
— Ajit Datta (@ajitdatta) May 3, 2022
Also Read:Kid distribute water: మండుటెండలో వీధి వ్యాపారులకు మంచి నీరు అందిస్తున్న బుడతడు: నెటిజన్లు ఫిదా