MP Shashi Tharoor : ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలి : ఎంపీ శశిథరూర్

ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో..146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదని.. ఇటువంటి ఘటనలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని ఎంపీ శశీథరూర్ అన్నారు.

MP Shashi Tharoor : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిసనలు చేపట్టింది. ఇండియా కూటమిలోని పలువురు నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ తో సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సేవ్ డెమెక్రసి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు.

దీంట్లో భాగంగా కేరళలోని తిరువనంతపురానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ నిరసన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మాట్లాడుతు..ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో..146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదన్నారు. ఇటువంటి ఘటనలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం ఏం జరిగినా తప్పు అని ప్రజలకు చెప్పడానికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది..అది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని..భారత కూటమిని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు.