Rahul Gandhi : లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత.. తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమైన రాహుల్ గాంధీ

లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. సీపీపీ కార్యాలయంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.

Rahul Gandhi : కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది. లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. సీపీపీ కార్యాలయంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీల్లో జోష్ నింపడానికే ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మరోవైపు రాహుల్ గాంధీ లోక్ సభ్యత్వం రద్దుపై పార్లమెంట్ లో కాంగ్రెస్ కు విపక్షాలు పూర్తి మద్దతు తెలిపాయి. సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై శివసేన కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉంది. దీంతో శివసేన నేత సంజయ్ రౌత్ భేటీ అయ్యారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ త్యాగం చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పినట్లు సమాచారం. పార్లమెంట్ రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు

ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్ సభ, రాజ్యసభ అట్టుడుకుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అదానీ అంశంపై విపక్షాలు ఆందోళనలతో హోరెత్తించాయి. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్ది సేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభ 12 గంటలకు వాయిదా పడగా, రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి పార్లమెంట్ ప్రారంభమైనా ఎలాంటి మార్పు కనపించలేదు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు ఏప్రిల్ 3వ తేదీ వరకు వాయిదా పడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు