క్రీడామంత్రిపై క్రీడాకారిణిని పోటీకి దించిన కాంగ్రెస్

కేంద్ర క్రీడాశాఖ మంత్రి,బీజేపీ నేత రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ కు పోటీగా ఒలింపిక్‌ క్రీడాకారిణిని కాంగ్రెస్ బరిలోకి దింపింది కాంగ్రెస్‌.

కేంద్ర క్రీడాశాఖ మంత్రి,బీజేపీ నేత రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ కు పోటీగా ఒలింపిక్‌ క్రీడాకారిణిని కాంగ్రెస్ బరిలోకి దింపింది కాంగ్రెస్‌.

కేంద్ర క్రీడాశాఖ మంత్రి,బీజేపీ నేత రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ కు పోటీగా ఒలింపిక్‌ క్రీడాకారిణిని కాంగ్రెస్ బరిలోకి దింపింది కాంగ్రెస్‌. జైపూర్‌ రూరల్‌ లోక్‌సభ స్థానం నుంచి డిస్కస్‌ త్రోయర్‌ కృష్ణ పునియా పేరుని సోమవారం(ఏప్రిల్-1,2019) కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read Also : 9 రాష్ట్రాలు.. 71 నియోజకవర్గాలు : నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్

ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ రాజ్యవర్ధన్‌ ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతుండగా.. ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్‌ భావించింది. రాజ్యవర్దన్ ఒలింపిక్‌ పతక విజేత. దీంతో క్రీడారంగానికి చెందిన కృష్ణ పునియాకు ఆయనకు పోటీగా దింపింది కాంగ్రెస్‌. 

పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణ పునియా 2004, 2008, 2012లో జరిగిన ఒలింపిక్‌ పోటీల్లో పాల్గొన్నారు. 2010లో జరిగిన దిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌ లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 2013లో కాంగ్రెస్‌ లో చేరిన పునియా.. ఆ ఏడాది జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సదుల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 
Read Also : చంద్రగిరిలో చంద్రబాబు : జగన్ మోటా రౌడీ చెవిరెడ్డి చోటా రౌడీ