ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి 18 ఫోటోలతో కూడిన ఫ్రేమ్‌ను తయారు చేసి ట్విటర్‌లో పోస్టు చేసింది కాంగ్రెస్.
కాంగ్రెస్ పోస్టు చేసిన ఫోటో ఫ్రేమ్‌లో ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల సందర్భంగా ఎయిరిండియా విమానం ఎక్కే సమయంలో కింద ఉన్న వారికి చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఫోటోల్లో సూట్ ధరించినట్లుగా ఉండగా ఇంకొన్ని ఫోటోల్లో ఆయా దేశ సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నట్లుగా ఉన్నాయి. హ్యాపీ వరల్డ్ టూరిజం డే అంటూ చిన్న సందేశం కూడా ఉంచింది కాంగ్రెస్. దేశంలో కన్నా మోడీ విదేశాల్లో ఉండేందుకే ఎక్కువ ఆశక్తి చూపుతున్నారని తెలియజెప్పేలా కాంగ్రెస్ ఈ పోస్ట్ చేసినట్లు అర్థమవుతోంది.
ప్రధానిగా నరేంద్రమోడీ చేసిన పర్యటనలు మరే ఇతర భారత ప్రధాని చేయలేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మోడీ ఉన్న అమెరికా పర్యటనతో కలిపి 2019 సెప్టెంబర్ వరకు 56 ఫారిన్ ట్రిప్స్ తో 60దేశాల్లో పర్యటించి మోడీ సరికొ్త రికార్డ్ క్రియేట్ చేశారు. 2014 మే లో తొలిసారిగా మోడీ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 2018 నాటికి ఆయన చార్టర్డ్ విమానాల ఖర్చు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్స్, విదేశీ పర్యటనల్లో ఉండగా హాట్‌లైన్ సదుపాయాలకు మొత్తం అయిన ఖర్చు రూ.2,021 కోట్లుగా ఉందని గత డిసెంబర్‌లో కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో తెలిపారు.
Happy #WorldTourismDay ✈️ pic.twitter.com/pPrRm9xOOn
— Congress (@INCIndia) September 27, 2019