Bharat Jodo Yatra: గడ్డకట్టే చలిలో చొక్కాలు విప్పేసి డాన్సులు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా, రోజువారి యాత్రలో సైతం రాహుల్ అదే టీషర్టులో ఉంటున్నారు. బయట ఇది పెద్దగా చర్చకు రానప్పటికీ, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంలో పార్టీ కార్యకర్తలు ఇలా చొక్కాలు లేకుండా స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లే కనిపిస్తోంది. యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కాస్త హుషారుగా కనిపిస్తున్నారు. అలాగే యాత్రకు సైతం స్పందన బాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ యాత్ర హర్యానా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కర్ణాల్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఉత్సహాన్ని భిన్నంగా చూపించారు. శీతాకాలం కావడంతో ఉత్తర భారతంలో స్వెటర్ లాంటిది లేకుండా బయటికి వెళ్లడం కష్టం. అలాంటి వాతావరణంలో చొక్కాలు విప్పి డాన్సు చేస్తూ రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు అక్కడి స్థానిక కార్యకర్తలు.

Chandrababu, Pawan Meeting: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. ఇరువురి భేటీలో చర్చకు వచ్చే అంశాలు ఏమిటంటే?

ప్రస్తుతం ఆ ప్రాంతంలో 4.5 డిగ్రీల సెల్సియస్ల చలి ఉంది. కాగా, భారత్ జోడో యాత్రలో భాగంగా శనివారం రాహుల్ ఈ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు. అయితే అక్కడి కార్యకర్తలు చొక్కాలు విప్పి, వాహనంపైకి ఎక్కి డాన్సులు చేశారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద రాహుల్ టీ-షర్టుతో కనిపించారు. ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా, రోజువారి యాత్రలో సైతం రాహుల్ అదే టీషర్టులో ఉంటున్నారు. బయట ఇది పెద్దగా చర్చకు రానప్పటికీ, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంలో పార్టీ కార్యకర్తలు ఇలా చొక్కాలు లేకుండా స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.


హర్యానా యాత్రలో రాహుల్ వెంట, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు, రేపు హర్యానాలో ఈ యాత్ర పూర్తవుతుంది. అనంతరం జనవరి 10న పంజాబ్ రాష్ట్రంలోకి అడుగు పెడుతుంది. ఫతేఘర్ సాహిబ్ నుంచి పంజాబ్‭లో యాత్ర కొనసాగుతుంది.

Delhi Jail Knives, Mobile Phones : ఢిల్లీ జైలులో ఖైదీల వద్ద కత్తులు, మొబైల్స్ ఫోన్లు లభ్యం

ట్రెండింగ్ వార్తలు