Sukesh Chandrasekhar: ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చా.. సుకేష్ చంద్రశేఖర్ తాజా ఆరోపణ

ఆమ్ ఆద్మీ పార్టీపై సుకేష్ చంద్రశేఖర్ మరో తాజా ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.

Sukesh Chandrasekhar: ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై వరుస ఆరోపణలు చేస్తున్న సుకేష్ చంద్రశేఖర్ తాజాగా మరో ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. మంగళవారం ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.

Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

దీనిపై అక్కడే ఉన్న సుకేష్ లాయర్ అనంత్ మాలిక్ కూడా స్పందించాడు. సుకేష్ చేసిన ఈ ఆరోపణపై ఢిల్లీ, పాటియాలా హౌజ్ కోర్టుకు చెందిన హై పవర్డ్ కమిటీ స్పందించిందని, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న కమిటీ దీనిపై విచారణ జరుపుతుందని లాయర్ తెలిపాడు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ కోసం సుకేష్ చంద్రశేఖర్ ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. ప్రముఖ వ్యక్తుల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేశాడని సుకేష్‌పై అభియోగాలున్నాయి. ప్రస్తుతం సుకేష్ మండోజి జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. సుకేష్ ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ తాను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు డబ్బులు ఇచ్చినట్లు ఆరోపించాడు.

Bihar: ప్రారంభానికి ముందే కూలిపోయిన బ్రిడ్జి.. రూ.13 కోట్లు వృథా

జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. అంతకుముందు పంజాబ్‌లో ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్ల రూపాయల నిధులు సమకూర్చిపెట్టినట్లు చెప్పాడు. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ కూడా రాశాడు. తాను ఎవరి ఒత్తిడి వల్ల ఈ లేఖలు రాయలేదని, తానే సొంతంగా లేఖలు రాసినట్లు చెప్పాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు