Contentrats Drinking Beer
కల్లు తాగిన కోతి గురించి వినే ఉంటారు.. మరి మందు తాగిన ఎలుక గురించి విన్నారా..? ఇదేదో కబుర్లు చెప్పడం కాదండీ.. నిజంగా ఎలుకలు ఫుల్లుగా మందుకొట్టాయి.
కల్లు తాగిన కోతి గురించి వినే ఉంటారు.. మరి మందు తాగిన ఎలుక గురించి విన్నారా..? ఇదేదో కబుర్లు చెప్పడం కాదండీ.. నిజంగా ఎలుకలు ఫుల్లుగా మందుకొట్టాయి. న్యూఇయర్ పార్టీని మస్త్ ఎంజాయి చేశాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పోలీసులే చెబుతున్న మాట. ఎలుకలు బాటిళ్లకొద్దీ మందు తాగేశాయని.. వెయ్యి లీటర్లు తాగి పారిపోయాయని చెబుతున్నారు. యూపీలోని బరేలీ కంటోన్మెంట్ పోలిసులు చెబుతున్న కహానీ ఇదీ..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున మద్యం దొరికింది. సీజ్ చేసి గోదాముల్లో ఉంచారు. కుక్క వెళ్లిన విషయాన్ని గమనించకుండా తాళం వేశారు. కుక్క చచ్చి.. కంపు కొట్టింది. దీంతో తాళం తెరిచి చూశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. గోదాంలోని వెయ్యి లీటర్ల లిక్కర్ కనిపించలేదు. సీసాలకు రంధ్రాలు పడి ఉన్నాయి. ఎలుకలు అటూ ఇటు తిరుగుతూ వారికి కనిపించాయి. వెంటనే ఓ క్లారిటీకి వచ్చారు. వెయ్యి లీటర్ల మందు.. ఎలుకలు తాగేశాయని ప్రకటించేశారు. ఎస్పీ స్వయంగా చెప్పటం విశేషం.
భవిష్యత్తులో అవి స్టోర్ రూములోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ప్రకటించారాయన. విచిత్రం ఏమిటంటే.. సీజ్ చేసిన మద్యాన్ని చట్టపరమైన ప్రొసీడింగ్స్ కోసం కొంత సేకరించి మిగతా దానిని ధ్వంసం చేయాలి. అలా కాకుండా మొత్తం మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో దాచడం, తర్వాత దానిని ‘ఎలుకలు’ తాగేశాయని చెప్పడంపై అనుమానాలు వస్తన్నాయి. దీనిపై విచారణ చేసి సిబ్బంది తప్పు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. వెయ్యి లీటర్లు తాగిన ఎలుకలు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌కి దొరకలేదా.. అంత ఫుల్‌గా మందుకొట్టి తిరుగుతుంటే ఎలా తప్పించుకున్నాయ్ అంటూ వెటకారాలు అడుతున్నారు.