5 KG LPG Cylinders : రేషన్ దుకాణాల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు కొనుక్కోవచ్చు

రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు, చక్కెర..ఇతర వాటితో మినీ ఎల్పీజీ సిలిండర్లను విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Ration Shops

5 KG LPG Cylinders At Ration Shops : రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు, చక్కెర..ఇతర వాటితో మినీ ఎల్పీజీ సిలిండర్లను విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్ రెడ్డి, ఎన్.రెడ్డప్పలు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు.

Read More : Parag Agrawal : ట్విట్టర్ కొత్త సీఈవో జీతం ఎంతో తెలుసా ? కళ్లు చెదిరిపోతుంది

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాలతో పాటు…ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా..మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చలు జరిగాయని, రేషన్ షాపుల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల్లో చేతుల్లోనే ఉందన్నారు. ఆసక్తిగలిగిన రాష్ట్రాలు మినీ ఎల్పీజీ సిలిండర్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

Read More : Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు

ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం లాంటి ఆయిల్ కంపెనీలు చిన్న సిలిండర్లను అమ్ముతుంటాయనే సంగతి తెలిసిందే. కమర్షియల్ సిలిండర్ 19 కిలోలు, డొమెస్టిక్ సిలిండర్ 14.2 కిలోల కెపాసిటీతో ఉంటారు. ఇవి కేవలం 5 కిలోల బరువుతో ఉంటాయి. గ్యాస్ సిలిండర్ అయిపోయినా…అత్యవసరంగా కావాల్సి వస్తే…పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చిన్న సిలిండర్లు వలస కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో రేషన్ షాపుల్లో రూ. 5 కేజీల గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయొవచ్చు. రేషన్ షాపుల్లో వీటిని అనుమతించడం వల్ల కొంతమందికి లాభం చేకూరనుంది.