Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు

తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్  తీవ్రమైన కోతకు గురైంది.

Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు

Triuamala Ghat Roads Damage

Tirumala Ghat Road :  తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్  తీవ్రమైన కోతకు గురైంది. నవంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు కొండ ప్రాంతం బాగా  తేమగా మారడంతో రోడ్డులో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. కొండపైకి వెళ్లే రోడ్డును మూసివేశారు. దిగువ ఘాట్ రోడ్డులోనే రెండు వైపులా వాహనాలను అనుమతిస్తున్నారు.

ఈ రోజు తెల్లవారుజామున తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులోని 16వ కిలో మీటర్ వద్ద భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. రాళ్లు ఏకంగా పైనుంచి మూడు రోడ్ల మీదుగా క్రింద పడ్డాయి. ఘూట్ రోడ్డులో పలు చోట్ల రోడ్డు కుంగి పోయాయి. భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఈ ఘటనతో ఎగువ ఘూట్ రోడ్డులో రాకపోకలు నిల్చిపోయాయి. టీటీడి యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తు పనులను చేపట్టింది.

ఇప్పటికే ఘూట్ రోడ్డులోని  మొత్తం 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత మాసంలో మూడు సార్లు కురిసిన భారీ వర్షానికి ఘూట్ రోడ్డు పై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే దారిలో ఐదు చోట్ల రోడ్డు కృంగింది. టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది తాత్కలిక మరమ్మత్తులు చేపట్టారు. ఐఐటి నిపుణుల బృందాన్ని తిరుమలకు రప్పించి ఘూట్ రోడ్డులో దెబ్బతిన్న రోడ్లతో పాటు కొండచరియలు విరిగిపడిన ప్రదేశాలను చూపించనున్నారు.
Also Read : TTD : తిరుపతి యాత్రను 15 రోజుల పాటు వాయిదా వేసుకోవాలి
శాశ్వత మరమ్మతులు చేసేందుకు వారి సలహాలను కోరనుంది .  గత వారం కూడా ఘూట్ రోడ్డుని పరిశీలించిన ఐఐటి నిపుణుల బృందం ఘూట్ రోడ్డులో పలు చోట్ల ప్రమాదకరమైన పరిస్ధితులు వున్నాయని … ఇంకా మరి కొన్ని చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడే అవకాశం వున్నట్లు తేల్చిచెప్పింది.

ఐఐటి నిపుణుల సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు ఘూట్ రోడ్డులో మరమ్మత్తు పనులు చేస్తుండగానే, బుధవారం, డిసెంబర్ 1వ తేదీ ఉదయం 16వ కిలో మీటర్ వద్ద ఓ భారీ కొండచరియ విరిగి… అక్కడ నుంచి మూడు రోడ్ల పై దొర్లుతూ 14వ కిలో మీటర్ వద్ద వున్న రోడ్డు పై పడింది. ఈ ప్రమాద తీవ్రతకు భారీ వృక్షాలు నెలకొరగడంతో పాటు బండరాళ్ళు రోడ్డు పై పడ్డాయి.

రెండు చోట్ల రోడ్డు కుంగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలోనే ఓ ఆర్టిసి బస్సు ఇంచు మించు అక్కడికి చేరగా కొండచరియలు విరిగిపడుతుండడాన్ని చూసిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు.

ఘూట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిందని సమాచారం అందుకున్న టీటీడి విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై ముందుగా రెండవ ఘూట్ రోడ్డులో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. హూటాహూటిన ఘటనా స్ధలానికి చేరుకొని రొడ్డు కుంగిన ప్రదేశం వద్దకు వాహనాలను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. ఇంజనీరింగ్, అటవీ అధికారులు కొండ చరియులు, వృక్షాలు నెలకొరిగిన ప్రదేశానికి చేరుకొని జెసిబి సహాయంతో రోడ్డు పై అడ్డంగా పడి వున్న బండరాళ్ళ,చెట్లను తొలగిస్తున్నారు.

ఇక అప్పటికే ఘూట్ రోడ్డులో చాలా వాహనాలు ఘటనా స్ధలానికి సమీపంలోకి రావడంతో వాటిని భద్రతా సిబ్బంది నిలిపివేసారు. దీంతో ఘూట్ లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను తిరుమలకు అనుమతించే పరిస్ధితి లేకపోవడంతో తిరిగి వాటిని రెండవ ఘూట్ రోడ్డులోనే తిరుపతికి పంపివేస్తున్నారు. తిరుమలలో విధులకు హాజరయ్యేందుకు చాలా మంది టీటీడి ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

ఎగువ ఘూట్ రోడ్డులో మరమ్మత్తుల కారణంగా ఈ రోడ్డును తాత్కలికంగా మూసివేసారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. మొదటి ఘూట్ రోడ్డులో గంట పాటు తిరుమలకు…మరో గంట పాటు తిరుపతికి వాహనాలను అనుమతిస్తున్నారు. విరిగిపడిన కొండచరియలు, చెట్లను పూర్తిగా తొలగించే పనుల్లో సిబ్బంది ఉన్నారు. ఎగువ ఘాట్ రోడ్ లో వాహనాలను అనుమతించేందుకు మరింత సమయం పట్టనుంది.