Parag Agrawal : ట్విట్టర్ కొత్త సీఈవో జీతం ఎంతో తెలుసా ? కళ్లు చెదిరిపోతుంది

మైక్రోసాప్ట్, యాహూ, ఏట్ అండ్ టీ సంస్థల్లో తొలుత పనిచేశారు. ఎక్కువగా పరిశోధన విభాగాల్లోనే పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారు

Parag Agrawal : ట్విట్టర్ కొత్త సీఈవో జీతం ఎంతో తెలుసా ? కళ్లు చెదిరిపోతుంది

Twitter

Twitter CEO Parag Agrawal : సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్ కు కొత్త సీఈవో వచ్చారు. ఆయన పేరు పరాగ్ అగర్వాల్. ఈయన ముంబై వాసి. భారతీయ వ్యక్తి ట్విట్టర్ సీఈవోగా నియమితులు కావడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆయనపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. భారత ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటారని కితాబినిస్తున్నారు. జాక్ డోర్సే సీఈవో పదవికి రాజీనామా చేశారు. అనంతరం పరాగ్ అగర్వాల్ ఆ బాధ్యతలను చేపట్టారు. పరాగ్ జీతానికి సంబంధించిన వివరాలను యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు ట్విట్టర్ తెలిపింది.

Read More : AP junior doctors Strike : ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్..స్టైఫండ్ లో ట్యాక్స్ కటింగ్ రద్దు చేయాలని డిమాండ్

వేతనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడాదికి 1 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ. 7,51,13,500 జీతం పొందుతారని వెల్లడించింది. 1.25 మిలియన్ డాలర్లు (రూ. 94 కోట్లు) విలువైన షేర్లు కూడా పొందుతారని, వచ్చు ఏడాది ఫిబ్రవరి 01వ తేదీ నుంచి పరాగ్ అగర్వాల్ కు అందుతాయని తెలిపింది. ఇక పరాగ్ అగర్వాల్ విషయానికి వస్తే…ముంబైలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వ అణు ఇంధన శాఖలో ఈయన తండ్రి పని చేశారు. ఆయన తల్లి స్కూల్ టీచర్ గా పనిచేశారు. ముంబైలోని అటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ – ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన అగర్వాల్…2011లో  సాప్ట్ వేర్ ఇంజినీర్ గా ట్విట్టర్ లో అడుగుపెట్టారు.

Read More : Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు

2015 కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికాకు వెళ్లి…కాలిఫోర్నియాలో స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ లో పీహెచ్ డీ చేశారు. ఇక్కడే డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మైక్రోసాప్ట్, యాహూ, ఏట్ అండ్ టీ సంస్థల్లో తొలుత పనిచేశారు. ఎక్కువగా పరిశోధన విభాగాల్లోనే పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. పరాగ్ ప్రతిభను మెచ్చుకుని 2017లో ట్విట్టర్ లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేశారు. నవంబర్ 29వ తేదీన ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి జాక్ డోర్సీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. దిగ్గజ ట్విట్టర్ సీఈవోగా నియమితుడైన అతి పిన్న వయస్కుడిగా పరాగ్ అగర్వాల్ నిలిచారు.