AP junior doctors Strike : ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్..స్టైఫండ్ లో ట్యాక్స్ కటింగ్ రద్దు చేయాలని డిమాండ్

 ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్ మోగించారు.

AP junior doctors Strike : ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్..స్టైఫండ్ లో ట్యాక్స్ కటింగ్ రద్దు చేయాలని డిమాండ్

Ap Junior Doctors Strike

Updated On : December 1, 2021 / 1:55 PM IST

ap  junior doctors Strike : ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్ మోగించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూడాల అసోసియేషన్ సమ్మె సైరన్ మోగించారు. బుధవారం (డిసెంబర్ 1,2021) నుంచి డిసెంబర్ 9 వరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమకు ఇస్తున్న స్టైఫండ్‌లో 10% టాక్స్ కట్ చేస్తున్న విధానాన్ని జూడాలు తప్పుపడుతున్నారు. సెక్షన్ 10 (16) కింద స్టైఫండ్‌ను స్కాలర్ షిప్‌గా పరిగణించి ట్యాక్స్ కట్ చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. త్వరితగతిన నీట్ పీజీ కౌన్సిలింగ్ జరిపి రిక్రూట్ చేసుకోవాలని ఇంకొక డిమాండ్ చేస్తున్నారు.

Read more : Telangana : మధ్యాహ్న భోజనం ప్రధానోపాధ్యాయుడు రుచి చూశాకే విద్యార్ధులకు వడ్డించాలి..

సమ్మె సందర్భంగా జూడాలు మాట్లాడుతు..మా డిమాండ్లు నెరవేర్చాలని..మాకు ఇచ్చే..స్టైఫండ్ లో 10 శాతం ట్యాక్స్ కట్ చేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. స్టై ఫండ్ ను స్కాలర్ షిప్ గా పరిగణించాలి తప్ప ట్యాక్స్ కట్టింగ్ లో చేయకూడదని..మా డిమాండ్ నెరవేర్చాలని లేదంటే సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.డిసెంబర్ 2న సంబంధిత కళాశాలల వద్ద క్యాండిల్‌ లైట్ మార్చ్ నిర్వహించనున్నామని తెలిపారు.

Read more : North Korea : ఆ సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

అలాగే మరునాడు అంటే డిసెంబర్ 3న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు లేఖల సమర్పించనున్నారు. డిసెంబర్ 4న సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.డిసెంబర్ 5న ఆసుపత్రిలో ఓపీడీ సేవలను నిలిపివేయడంతో పాటు డిసెంబర్ 7 నుంచి ఐచ్ఛిక సేవలను నిలిపివేయడం, డిసెంబర్ 9 నుంచి అత్యవసర సేవలను నిలిపివేయనున్నట్లు జూడాలు సమ్మె నోటీస్ ఇచ్చారు.