Gujarat Cop : భార్యకు విడాకులు ఇస్తే..రూ. 25 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రియురాలిని చంపేసిన పోలీస్!

అహ్మదాబాద్ కు చెందిన అజయ్ దేశాయ్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో అతడికి వివాహం అయ్యింది. అనంతరం మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా..ప్రేమగా మారి..సహజీవనానికి దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు వత్తిడి చేయడం స్టార్ట్ చేసింది.

Cop Confesses To Killing Lover : ఆల్రెడీ భార్య ఉంది. బాధ్యతయుతమైన డ్యూటీ చేస్తున్నాడు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఆ పోలీసు తప్పదారి పట్టాడు. భార్య ఉండగానే..మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని..భార్యకు విడాకులు ఇవ్వాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో..ఆ పోలీసు తట్టుకోలేకపోయాడు. భార్యకు విడాకులు ఇస్తే..ఎక్కడ భరణం ఇవ్వాల్సి వస్తుందోనన్న ఆలోచన ఆ పోలీసు మెదడులో మెదిలింది. దీంతో ప్రియురాలిని కడతేర్చాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు.

Read More : Telangana Dalit Bandhu : ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం : కేసీఆర్

అహ్మదాబాద్ కు చెందిన అజయ్ దేశాయ్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో అతడికి వివాహం అయ్యింది. అనంతరం మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా..ప్రేమగా మారి..సహజీవనానికి దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు వత్తిడి చేయడం స్టార్ట్ చేసింది. చివరకు ఓ గుడిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ…చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలని, భార్యకు విడాకులు ఇవ్వాలని పట్టుబట్టసాగింది.

Read More : Monsoon Tips: వానాకాలంలో ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. స్వీటి కోరినట్లు భార్యకు విడాకులు ఇస్తే…భరణంగా ఆమెకు రూ. 25 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని..అంత డబ్బు ఇవ్వడం ఇష్టంలేని అజయ్..భార్యను అడ్డుతొగిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. జూన్ 04వ తేదీన ఇదే విషయం మీద అజయ్, ప్రియురాలి మధ్య గొడవ ప్రారంభమైంది. గొడవ ముదరడంతో ఆగ్రహానికి గురైన అజయ్..ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. జూన్ 05వ తేదీన ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణలో అజయ్ చేసిన దారుణం వెలుగు చూసింది. తర్వాత..అజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు