Corona Cases (2)
Corona Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఇక పాసిటివిటీ రేటు కూడా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. గత 14 రోజులుగా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువే నమోదవుతుంది. పాసిటివిటీ అంటే 100 టెస్టులు చేస్తే 5 మందికి లోపే కరోనా పాజిటివ్ నిర్దారణ అవుతుంది.
కరోనా కేసులు తగ్గుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా ఆంక్షలు తొలగిస్తున్నాయి. అయితే 5 శాతం అనేది ఎక్కువని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. గతంలో ఒక్కశాతం పాసిటివిటీ రేటు ఉన్న సమయంలో సెకండ్ వేవ్ వచ్చిందని, ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కరోనా అదుపులోకి వచ్చినట్లు చెప్పలేని వారు అభిప్రాయపడుతున్నారు. కరోనాలో కొత్త వేరియంట్ల ద్వారా ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తున్నారు.
ఇక మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. మంగళవారం 42,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 91 రోజుల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరాయి. మరోవైపు మరణాలు కూడా చాలా తగ్గాయి.
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 1,167 మంది మృతి చెందారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. సోమవారం ఒకే రోజు 80 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక అత్యధిక వ్యాక్సినేషన్ చేసిన మొదటి 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక.