Corona Cases India : భారత్‌ పై కరోనా దండయాత్ర.. వరుసగా మూడోరోజు 3 లక్షలు దాటిన కేసులు

భారత్‌పై కరోనా వైరస్‌ దండయాత్ర చేస్తోంది. వరుసగా మూడో రోజు కూడా రికార్డ్‌ స్థాయిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Corona Cases Crossed 3 Lakhs For The Third Day In India

Corona cases in India : నన్ను ఆపగలవారేవరు..? అన్నట్టుగా భారత్‌పై కరోనా వైరస్‌ దండయాత్ర చేస్తోంది.. వరుసగా మూడో రోజు కూడా రికార్డ్‌ స్థాయిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.. ఈ సారి ఏకంగా కేసుల సంఖ్య రికార్డ్‌ స్థాయిలో 3 లక్షల 50 వేలకు చేరువలో కేసుల సంఖ్య ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.. శుక్రవారం దేశవ్యాప్తంగా 3 లక్షల 45 వేల కేసులు నమోదయ్యాయి.. ఇక మరణాల విషయంలో సరికొత్త రికార్డ్‌ నెలకొంది.

మొత్తం 2 వేల 620 మందిని ఈ వైరస్‌ పొట్టన పెట్టుకుంది. వరుసగా నాలుగు రోజుల నుంచి ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 వేలు దాటుతోంది.. కొత్త కేసులను కలుపుకొని భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కోటి 66 లక్షలు దాటగా.. మరణించిన వారి సంఖ్య లక్షా 89 వేల మంది మృతి చెందారు.. ఇక మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25 లక్షలకు చేరింది..

ప్రస్తుతం ప్రపంవ్యాప్తంగా అత్యధికంగా రోజువారీ కరోనా కేసుఏలు నమోదవుతున్న దేశంగా ఇండియా రికార్డులకెక్కింది.. కరోనాతో అత్యంత తీవ్రంగా బాధపడుతున్న బ్రేజిల్‌, అమెరికా, టర్కీలను భారత్‌ ఎప్పుడో అధిగమించింది.. బ్రేజిల్‌లో కేవలం 79 వేల కేసులే నమోదు కాగా.. అమెరికాలో 62 వేలు, టర్కీలో 54 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి.. ప్రపంచం మొత్తంలో 8 లక్షల 90 వేల కొత్త కేసులు నమోదైతే.. కేవలం ఇండియాలో 37 శాతం కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఆందోళకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్‌, బిహార్, బెంగాల్‌, ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి.. దీంతో ఈ రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూలు, ఆంక్షలు, వీకెండ్‌ లాక్‌డౌన్లు విధిస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూల్స్‌ మూతపడ్డాయి..

ఇక ఎక్కువ స్థాయిలో యాక్టివ్‌ కేసులున్న నగరంగా బెంగళూరు నిలించింది.. కర్ణాటక మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదవుతున్నాయి…. ఇక రెండో స్థానంలో పుణె, మూడో స్థానంలో హైదరాబాద్‌ ఉంది.. ఆ తర్వాత స్థానంలో ముంబై, నాగపూర్, థానే ఉన్నాయి.