ఇండియాలో కరోనా కేసులు @ 536

  • Publish Date - March 25, 2020 / 01:27 AM IST

భారతదేశాన్ని కరోనా రాకాసి వీడడం లేదు. పంజా విసురుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య  ఎక్కువవుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ కట్టడి కావడం లేదు. 2020, మార్చి 23వ తేదీ సోమవారం 496 ఉన్న కరోనా కేసులు..2020, మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా…మొత్తం కేసులు…536కి చేరుకున్నాయి.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 10కి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…తాజా వివరాలతో భారత వైద్య పరిశోధన మండలి (ICMR) బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 21 వేల 804 మంది నుంచి 22 వేల 694 నమూనాలు సేకరించడం జరిగిందని తెలిపింది. భారత ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ గడువు పెంచింది. ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు స్వయంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.

మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలను కాపాడుకొనే ఉద్దేశ్యంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రతొక్కరూ దీనిని విధిగా పాటించాలని, ఏ ఒక్క పౌరుడు ఇళ్లు దాటి బయటకు రావొద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపెడుతున్నా…ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

See Also | కరోనా : ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది పూర్తిగా కోలుకున్నారు