Corona Deaths Bangalore : బెంగళూరులో కరోనా మరణ మృదంగం..మృత దేహాలతో నిండిపోయిన శ్మశానాలు

కర్ణాటకలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్‌ మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి.

:Corona Deaths in Bangalore : కర్ణాటకలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్‌ మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి. బెంగళూరులోని శ్మశాన వాటికల ముందు అంబులెన్సులు క్యూ కట్టాయి. కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు వాళ్ల కుటుంబీకులు. గంటల తరబడి శ్మశానవాటికల బయట వెయిట్‌ చేస్తున్నారు.

దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరోసారి 3లక్షలకు పైగా కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 86వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3వేల 498మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2లక్షల 97వేల 540మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ఇదొక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 31.70లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 30,2021) ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో 3లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఇది వరుసగా 9వ రోజు. ఇక 3వేలకు పైగా మరణాలు నమోదవడం వరుసగా ఇది 3వ రోజు. దేశంలో ఏప్రిల్ 21న తొలిసారి రోజువారి కేసుల సంఖ్య 3లక్షల మార్క్ దాటింది. ఆ రోజు నుంచి నిత్యం 3లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఏప్రిల్ 27న తొలిసారిగా మరణాల సంఖ్య 3వేల మార్క్ దాటింది. నాటి నుంచి రోజూ 3వేలకు పైనే మరణాలు నమోదవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు