stock markets at a huge loss : స్టాక్‌మార్కెట్లను అమ్మకాలు కుదిపేసాయి. బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రేయిన్ ఎఫెక్ట్ మార్కెట్లను దారుణంగా దెబ్బతీసింది. సెన్సెక్స్ 16వందల పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 5వందల పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. ఫార్మా మినహా మార్కెట్లోని అన్ని ఇండెక్స్‌లు నష్టాల్లోనే ఉన్నాయి.
ఒక దశలో బ్యాంకింగ్ ఇండెక్స్ 5 పాయింట్లు కోల్పోయింది. మెటల్ ఇండెక్స్ దాదాపు 4శాతం కోల్పోయింది. ఇన్ఫ్రా షేర్లు కూడా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. ఫార్మా ఒక్కటి మాత్రం 2శాతం లాభాల్లో కొనసాగుతోంది.
మారుతీ, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో నష్టాల్లో ఉన్నాయి. ONGC షేరు 9శాతం కోల్పోయింది. టాటా మోటార్స్ కూడా 8శాతం నష్టపోయింది. గెయిల్, ఐఓసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 7శాతానికి పైగా పడిపోయాయి.