భారత్ లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. జమ్మూకశ్మీర్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా జైల్లో మొత్తం 190 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 86 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కరోనా సోకిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు సూపరింటెండెంట్ సైరోజ్ అహ్మద్ భట్ తెలిపారు. జైలు మొత్తాన్ని అధికారులు శానిటైజ్ చేశారు. ఇతర ఖైదీలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జమ్మూకశ్మీర్ లో ఇప్పటివరకు 12,156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 222 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 5,488 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ వైరస్ నుంచి 6,446 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.