Corona For Central Cec Sushil Chandra
Corona for Central CEC Sushil Chandra : కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కరోనా సెగ తాకింది. ఇటీవలే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సుశీల్ చంద్ర కరోనా బారిన పడ్డారు. ఎన్నికల సంఘం సభ్యుడు రాజీవ్ కుమార్ కు కూడా కరోనా సోకింది. సీఈసీ కూడా కరోనా బారిన పడటంతో బెంగాల్ ఎన్నికల నిర్వహణపై ఆ ప్రభావం పడనుంది. ఇకపై అన్ని సమీక్షా సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే నిర్వహించనున్నారు.
కరోనా తుఫాన్‌లో భారత్ అల్లకల్లోలం అవుతోంది. ఒక్కరోజులోనే దేశంలో 2 లక్షల 59 వేల 170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే 14 వేల కేసులు తగ్గినట్లు కనిపించినా… మొన్న ఆదివారం వీకెండ్ కావడం, టెస్టింగ్ సెంటర్లు క్లోజ్ చేసి ఉండడంతో టెస్టులు తక్కువ చేశారు. ఆ లెక్కన ఇవాళ నమోదైన కేసులు తక్కువేమి కాదు. వైరస్ ఉధృతి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే రోజుకు 3లక్షలు కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వెయ్యి 761మందికి పైగా కరోనాతో చనిపోయారు. పరిస్థితి చూస్తుంటే ఈ వారంలోనే రోజుకు 2వేలకు పైగా కరోనా మరణాలు నమోదవడం పక్కాగా తెలుస్తోంది.