Multisystem inflammatory syndrome: పిల్లలలో కరోనా.. వైరస్ లేకపోయినా లక్షణాలు.. మూడవ వేవ్ వస్తే ఏం చెయ్యాలి?

పిల్లలలో కరోనా కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కరోనా మూడవ వేవ్ వస్తే, పిల్లలకే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, మునుపటి కంటే ఎక్కువగా సంఖ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు.

Corona type symptoms: పిల్లలలో కరోనా కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కరోనా మూడవ వేవ్ వస్తే, పిల్లలకే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, మునుపటి కంటే ఎక్కువగా కరోనా కేసుల సంఖ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో వారికి సంబంధించిన మార్గదర్శకాలు తీసుకుని రావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్, కరోనా ఇన్ఫెక్షన్ కనిపించిన పిల్లలలో చాలా మందికి లక్షణాలే కనిపించలేదని, అయితే మొత్తం సోకిన పిల్లలలో కేవలం 2-3% మందికి మాత్రమే ఆసుపత్రి అవసరమైనట్లుగా వెల్లడించారు. పిల్లలలో రెండు రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని, చాలా మంది పిల్లలలో జ్వరం, దగ్గు లక్షణాలు కనిపిస్తున్నాయి అని చెప్పారు.

కొంతమంది పిల్లలలో కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని, అయితే కోలుకున్న తర్వాత కరోనా 2నుంచి 3వారాలలో చాలా మంది పిల్లలకు జ్వరం, శరీరంలో దురద, ఎర్రటి కళ్ళు, విరేచనాలు, వాంతులు ఊపిరి పీల్చడంలో కష్టం అనిపించడం.. వంటి లక్షణాలు కనిపించాయని డాక్టర్ వీకే పాల్ చెప్పారు. వైరస్ లేకపోయినా కూడా పిల్లల్లో లక్షణాలు కరోనా వలె ఉన్నాయని, ఇటువంటి లక్షణాలను మల్టీ సిస్టమ్ ఇన్‌ప్లమేటరీ సిండ్రోమ్ అంటారు.

ఇటువంటి కేసులు ఎక్కువైన తరుణంలో, ప్రభుత్వం నిపుణుల జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. పిల్లలలో ఇలాంటి లక్షణాలకు కమిటీ త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అయితే, పిల్లలలో కనిపించే ఇటువంటి లక్షణాలకు చికిత్స అందుబాటులో ఉందని వీకే పాల్ స్పష్టం చేశారు. పిల్లలకు సంబంధించి ఏర్పాట్లు బలోపేతం చేస్తున్నట్లు వీకే పాల్ చెప్పారు.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో, 9వేల మందికి పైగా పిల్లలు కరోనా బారిన పడగా అది మూడవ వేవ్ కాదని, సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య చివరిసారి కంటే ఎక్కువగా ఉన్నందున, పిల్లలకు కూడా అదే నిష్పత్తిలో వైరస్ సోకినట్లు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. కొంతమంది పిల్లలలో కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని, అయితే పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు. అయితే వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటే మాత్రం ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వైరస్‌లో మార్పులను అర్థం చేసుకొని ఎలా స్పందించాలో అలా స్పందిస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు