భారత్ లో 8వేలు దాటిన కరోనా కేసులు…24 గంటల్లో 34 మరణాలు

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్‌ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

డిచిన 24 గంటల్లో 909 కేసులు, 34 మంది మృతిచెందారని వెల్లడించింది. 7367 యాక్టివ్‌ కేసులు నమోదు కాగా.. 716 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపింది. మరోవైపు కరోనా హాట్ స్పాట్ లు మహారాష్ట్ర,ఢిల్లీ నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. ఢిల్లీలో 1069 కరోనా కేసులు,19మరణాలు నమోదవగా,మహారాష్ట్రలో 1761 కరోనా కేసులు,127 మరణాలు నమోదయ్యాయి. 

ఇక గత నెల భారత ప్రధాని ప్రకటించిన 21రోజల లాక్ డౌన్ తో మంగళవారం(ఏప్రిల్-14,2020)తో ముగియనుంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇప్పటివరకు చేసినదంతా వృద్ధా అవుతుందని శనివారం ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీకి తెలియజేశారు. ప్రధాని కూడా లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. దీంతో ఏప్రిల్-30వరకు లాక్ డౌన్ పొడించే ప్రకటన ఇవాళ అధికారికంగా వెలువడనుంది.